ఈ 60 శాతం లెక్క‌!.. మోదీకి ఓట‌మి ఖాయ‌మే!

ఈ 60 శాతం లెక్క‌!.. మోదీకి ఓట‌మి ఖాయ‌మే!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిది? ప‌్ర‌ధాన మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోదీ మ‌రోమారు ఆ పీఠాన్ని ద‌క్కించుకుంటారా?  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ సారైనా స‌త్తా చాటి... త‌న త‌ల్లి సోనియా గాంధీ క‌ల నెర‌వేరుస్తారా?  తృతీయ కూట‌మి పేరిట వినిపిస్తున్న ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకుంటాయా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు. ఎన్నో విశ్లేష‌ణలు. ఎన్నోత‌ర్కాలు. చివ‌రి రెండు విష‌యాల గురించి ఇప్పుడే చెప్ప‌లేం గానీ... తొలి అంశంలో మాత్రం కాద‌నే చెప్పాలి. ఇదేదో బీజేపీ మీద వ్య‌తిరేక‌తో, లేదంటే ప్ర‌ధానిగా మోదీ తీసుకున్న ప్ర‌జా కంట‌క విష‌యాల ఆధారంగా చెబుతున్న విష‌య‌మో కాదు. స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఏర్పాటైన 16 లోక్ సభ‌ల తీరుతెన్నుల‌ను ప‌రిశీలించి చెబుతున్న మాట‌. ఈ లెక్క ప్ర‌కారం మోదీకి ఈ ద‌ఫా ఓట‌మి ఖాయ‌మ‌నే చెప్పాలి. అంతేకాదండోయ్... అస‌లు మోదీ ప్ర‌ధాని కాకున్నా, క‌నీసం ఆయ‌న మ‌రోమారు ఎంపీగా ఎన్నిక‌వుతారా? అన్న‌ది కూడా డౌటేన‌ని కూడా చెప్పాలి.

నిజ‌మా? అంటే... నిజ‌మే మ‌రి. మ‌రి ఆ లెక్క‌లేమిటో చూద్దాం ప‌దండి. ఇప్ప‌టిదాకా 16 ద‌ఫాలుగా లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే... ఒక‌సారి ఎంపీగా ఎన్నికైన నేత‌, మ‌రోమారు ఎంపీగా ఎన్నిక కాకుండా చ‌తికిల‌బ‌డిన వారి శాతం ఏకంగా 60 శాతంగా ఉంది. ఇప్ప‌టిదాకా మొత్తం 16 లోక్ స‌భ‌ల‌కు ఎన్నికైన మొత్తం నేత‌ల సంఖ్య 4,843 అయితే... వీరిలో సెకండ్ టైం ఎంపీగా గెల‌వ‌లేక‌పోయిన వారు ఏకంగా 2,840 మంది. అంటే ఇలా సింగిల్ టైం ఎంపీలుగా మిగిలిపోయిన వారి శాతం ఏకంగా 58.64 శాతం అన్న‌మాట‌. అంటే తొలిసారి లోక్ స‌భ‌కు ఎన్నికై... ఆ వెంట‌నే రెండో ప‌ర్యాయం విజ‌యం వాకిట బోల్తా ప‌డిన వారు ప్ర‌తి ఐదుగురిలో ముగ్గుర‌న్న మాట‌.

ఇక వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా ఎలాగోలా నెట్టుకొచ్చేసిన ఎంపీల సంఖ్య 2,003గా తేలితే... వీరిలో థ‌ర్డ్ టైం ఎంపీలుగా గెల‌వ‌లేక ఇంటిదారి ప‌ట్టిన వారు వెయ్యి మందికి పైగానే ఉన్నారు. అంటే సెకండ్ టైం కూడ విజ‌యం సాధించి థ‌ర్డ్ టైం బోల్తా ప‌డిన వారు 50 శాతం మంది అన్న మాట‌. అంటే రెండోసారి కూడా లోక్ స‌భ‌కు ఎన్నిక‌లైన వారిలో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రు ఓట‌మినే చవిచూశారు. ఈ లెక్క‌న బీజేపీలో న‌రేంద్ర మోదీతో స‌హా చాలా మంది కొత్త‌గా లోక్ స‌భ‌కు ఎన్నికైన వారే. కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే... బీజేపీతోనే కొత్త వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మ‌రి ఈ లెక్క‌న లోక్ స‌భ చ‌రిత్ర చెబుతున్న‌ట్లుగా ఈ ద‌ఫా కొత్త‌వారిలో 60 శాతం మంది ఇంటిదారి ప‌డితే.. రెండో టెర్మ్ కూడా గెలిచి మూడో టెర్మ‌లో బోల్తా ప‌డిన వారు 50 శాతం మంది ఉంటే... ఇక ఈ సారి మోదీ గెల‌వ‌డం దాదాపుగా దుస్సాధ్య‌మేన‌ని చెప్ప‌క తప్ప‌దన్న వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English