ఐపీఎల్ ఫైనల్లో అతడి అతిపై తీవ్ర విమర్శలు

ఐపీఎల్ ఫైనల్లో అతడి అతిపై తీవ్ర విమర్శలు

ఆదివారం రాత్రి క్రియుట్ ప్రియులు మామూలు మజాను అనుభవించలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఫైనల్ నభూతో అని చెప్పాల్సిందే. భవిష్యత్తులో కూడా ఏ ఐపీఎల్ ఫైనల్ అయినా ఇంత ఉత్కంఠభరితంగా సాగుతుందా అన్నది సందేహమే. చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు చెన్నైకి మంచి అవకాశాలే వచ్చినా ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒకటికి రెండు కీలక రనౌట్లు ఆ జట్టు కొంప ముంచాయి. ముఖ్యంగా చెన్నై మంచి స్థితిలో ఉండగా ధోని రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ రనౌట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. చాలా క్లోజ్‌గా కనిపించిన ఈ రనౌట్ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ధోనీని నాటౌట్‌గా ప్రకటిస్తారేమో అనిపించింది అందరికీ.

రీప్లేలు చూసిన వాళ్లంతా ధోని నాటౌట్ అనే అనుకున్నారు. బంతి స్టంప్‌కు తాకే సమయంలో బ్యాట్ క్రీజు లోపల ఉన్నట్లే కనిపించింది. ఐతే రీప్లేలు కనిపిస్తున్న సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన అతి గురించి ఎంత చెప్పినా తక్కువే. సంజయ్ మంజ్రేకర్‌ ముంబయి వాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అతను పక్షపాతంతో వ్యవహరిస్తాడన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఐపీఎల్‌లో అతనెప్పుడూ ముంబయి మ్యాచ్‌కు కామెంట్రీలో కూర్చున్నా.. అది తన జట్టు అన్నట్లుగా మాట్లాడుతుంటాడు. ఆ జట్టు ఆటగాళ్లను తెగ పొగిడేస్తుంటాడు. ఈ విషయంలో ఉన్న విమర్శలు చాలవని.. ధోని ఔట్ విషయంలో ముంబయి జట్టులో సభ్యుడి తరహాలో వాదనకు దిగాడు. అది ఔట్ అంటే ఔట్ అంటూ గట్టిగా అరిచాడు. కామెంట్రీ బాక్సులో తటస్థంగా ఉండాల్సిన మంజ్రేకర్ ఇలా ఒక జట్టు తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా అరవడం ఆశ్చర్యం కలిగించింది.

తమిళ జనాలకు మంజ్రేకర్ మీద తీవ్ర ఆగ్రహం కలిగింది. హీరో సిద్దార్థ్, దర్శకులు వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్ సహా చాలామంది మంజ్రేకర్ తీరును దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్లకు కామెంట్రీ బాక్సులోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English