భార‌త్‌ తొలి ఉగ్ర‌వాది హిందువే

భార‌త్‌ తొలి ఉగ్ర‌వాది హిందువే

సినీన‌టుడు, ఇటీవ‌లే రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన మ‌క్క‌ల్ నీధి మ‌య‌మ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. స్వ‌తంత్ర భార‌త దేశంలో మొద‌టి ఉగ్ర‌వాది ఓ హిందూవే అంటూ సంచ‌ల‌న కామెంట్ చేశాడు. ఆ హిందూ ఉగ్ర‌వాది నాథూరామ్ గాడ్సే అంటూ తెలిపాడు.  ఉప ఎన్నిక‌ల కోసం అల‌వ‌కురుచ్చిలో ఆదివారం ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో క‌మ‌ల్ ఆ వ్యాఖ్య‌లు చేశాడు.

అల‌వకురుచ్చిలో ముస్లింల ఆధిప‌త్యం అనే విశ్లేష‌కులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్క‌డ క‌మ‌ల్‌హాస‌న్ మాట్లాడుతూ, జాతిపిత మ‌హాత్మా గాంధీని హ‌త్య చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కావాల‌ని క‌మ‌ల్ అన్నారు. మ‌హాత్ముడిని హ‌త్య చేసిన గాడ్సే భార‌తదేశ మొట్ట మొదటి ఉగ్ర‌వాది అన్నారు. తానో గ‌ర్వించ‌ద‌గ్గ భార‌తీయుడినంటూ.. త్రివ‌ర్ణ ప‌తాకంలో మూడు రంగులు విభిన్న విశ్వాసాల‌ను తెలియ‌జేస్తాయ‌న్నారు. ఇది ముస్లిం ఆధిప‌త్య ప్రాంతం క‌నుక తానేమీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం లేద‌ని, తాను ఈ వ్యాఖ్య‌ల‌ను గాంధీ విగ్ర‌హం ముందు చేస్తున్నాన‌ని, స్వేచ్ఛా భార‌తంలో మొద‌టి ఉగ్ర‌వాది హిందువే అని, అత‌ని పేరు నాథురామ్ గాడ్సే అని, అక్క‌డ నుంచే(అతివాదులు) ఉగ్ర‌వాదం మొద‌లైన‌ట్లు క‌మ‌ల్ చెప్పారు.

భారతదేశంలో సమానత్వం ఉండాలని కోరుకునే భారతీయుల్లో నేను ఒకడ్ని.  తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు చేసిన తప్పుల నుండి ఏమీ నేర్చుకోలేదు అంటూ విరుచుకుపడ్డారు.  కమల్ మాటలకు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల‌ కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య చీలిక తెచ్చిన వ్య‌క్తి క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. మ‌రోవైపు నటుడు వివేక్ ఒబెరాయ్ సైతం అభ్యంతరం చెప్పారు. క‌మ‌ల్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English