తెరాసలో తన్నులాటలు

తెరాసలో తన్నులాటలు

తెలంగాణలో తమదే ఆధిపత్యమన్న ధోరణితో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌ చేసిన ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర సమితిని ఇబ్బందుల్లో పడేయగా, పార్టీలోని నేతల మధ్య వైరం పార్టీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయంట.

నల్గొండ జిల్లాలో టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌పై నకిరేకల్‌ ఇన్‌ఛార్జి వీరేశం అనుచరులు దాడి చేశారు. ఈ గలాటాలో ఇరువర్గాలకూ చెందినవారు గాయపడ్డట్లుగా వార్తలు అందుతున్నవి. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి కుమ్ములాటలూ, తన్నులాటలూ జరుగుతుంటాయి. కాని ఉద్యమ పార్టీ అంటే క్రమశిక్షణ ఎక్కువ ఉండాలె. ఆ పార్టీలోనే క్రమశిక్షణ లేకపోతే ఎలాగ? తెరాసలో తన్నులాటలు తెలంగాణ ఉద్యమానికి చేటు తెచ్చే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది ఆ పార్టీని అభిమానిస్తున్నవారిలో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు