కేటీఆర్ దోస్తుకే సీటు..సీనియ‌ర్ మ‌ళ్లీ బ‌లి

కేటీఆర్ దోస్తుకే సీటు..సీనియ‌ర్ మ‌ళ్లీ బ‌లి

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ కీల‌క ఘ‌ట్టం పూర్తి చేశారు. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డిని కేసీఆర్‌ ఖరారు చేశారు. ఆయా జిల్లాల మంత్రులతో సీఎం సమావేశమై అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ముగ్గురు అభ్యర్థులకు బి-ఫారాలను కూడా ఇవ్వనున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, సునాయాసంగా విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ ఎన్నిక‌లు, టీఆర్ఎస్ అభ్య‌ర్థుల ఖ‌రారులో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స‌న్నిహితుడైన నేత‌కు టికెట్ ఇచ్చి...పార్టీ సీనియ‌ర్ నేత‌కు మ‌రోమారు షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న‌ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్‌ను న‌మ్ముకొని ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సైతం ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు హామీ ఇచ్చారు. దీంతో షెడ్యూల్ విడుదలైన అనంత‌రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టికెట్‌ వేటలో ఆయన పేరు కూడా ఉన్నట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు ఖ‌రారు చేశారు.

పార్టీ సీనియ‌ర్‌గా, ఉద్య‌మ‌కాలం నుంచి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తున్న నాయ‌కుడికి మ‌రోమారు కేసీఆర్ మొండిచేయి చూప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌నీసం సొంత సామాజిక వ‌ర్గం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా..త‌న‌కు ఈ ద‌ఫా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ర‌వీంద‌ర్ రావు ఆశించినా...ఆయ‌న‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురైంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English