గుంటూరోళ్లకు కులం పిచ్చి, డబ్బు పిచ్చి - మాధవీలత

గుంటూరోళ్లకు కులం పిచ్చి, డబ్బు పిచ్చి - మాధవీలత

బాహుబలి మొదటి పార్టు విడుదలయ్యాక దేశమంతటా ఒకటే ప్రశ్న... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని ఇపుడు ఏపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏపీలో ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్న తెగ వైరల్ అవుతోంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. బయటకు ఏమో మేమే గెలుస్తాం అని ఎవరికి వారు లెక్కలు చెబుతున్నారు. కానీ లోపల మాత్రం ఏం జరుగుతుందో? మా ఎమ్మెల్యే గెలుస్తాడా? లేదా? అంటూ భయపడుతున్నారు. అందరిలో ధీమా ఎంతుందో, భయమూ అంతే ఉంది.

ఈ నేపథ్యంలో రాజకీయాల్లో జాయిన్ అయిన తెలుగు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతను ఓ మీడియా ప్రతినిధి ఏపీ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయని ప్రశ్నించారు. ఈ వైరల్ ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఏపీలో ఏ పార్టీ గెలవనుందో ఏపీ ప్రజలు స్పష్టంగా తెలుసు అన్నారు. అక్కడ హవా ఏ పార్టీది ఉందో నా నోటితో ఎందుకు చెప్పించడం? నాకు తెలుసు. కానీ నేను ప్రజలకు నా నోటితో చెప్పను అన్నారు. అయితే, ఒకోసారి ఊహించిన దానికి భిన్నంగా జరిగే అవకాశమూ లేకపోలేదు.  

‘‘ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం బాగా ఎక్కువ ఉంది. నేను స్వయంగా చూసి చెబుతున్నాను. కులానికి, డబ్బు కు లొంగకుండా రాజకీయాల్లో నిలబడే వారి నిజమైన నాయకులుగా మిగులుతారు. ప్రజలు కూడా అలా ఉంటేనే సరైన నాయకుడిని ఎన్నుకుంటున్నారు. తెలుగు వారు డబ్బు తీసుకుని ఓట్లేస్తారని ప్రపంచంలో బ్యాడ్ గా పాపులర్ అయ్యాం. మన పరువు మనమే తీసుకుంటున్నాం. చాలా దిగజారుతున్నాం. ఇక గుంటూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువ అక్కడ. ప్రజలు వాటిని ప్రోత్సహిస్తే నిజాయితీ పరులు అయిన నాయకులు ఇక పుట్టబోరు అన్నారు. ప్రజలు ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో" అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English