సోనియ‌మ్మ ప్లేస్ బాబుదే!... ఇదిగో లెక్క‌!

 సోనియ‌మ్మ ప్లేస్ బాబుదే!... ఇదిగో లెక్క‌!

దేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ ఒక్క‌రూ ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న వాద‌న అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంది. గ‌తంలో వ‌చ్చినంత మేర మెజారిటీ రాకున్నా... ఈ సారి కూడా ఎన్డీఏనే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్న వాద‌న‌ నిన్న‌టిదాకా వినిపించినా... ఆ వాద‌న అంత‌కంత‌కూ బ‌ల‌హీన‌ప‌డుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ కూటమికి కూడా అంత‌గా అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. మ‌రి జ‌రిగేదేంటి?.. ఈ దిశ‌గా సాగుతున్న విశ్లేష‌ణ‌ల్లో ప్రాంతీయ పార్టీలే కింగ్ మేక‌ర్ల‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప‌శ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని విప‌క్ష కూట‌మి ఎస్పీ, బీఎస్పీ, త‌మిళ‌నాడులోని విప‌క్షం డీఎంకే, క‌ర్ణాట‌క‌లోని అధికార కూట‌మిలోని కీల‌క భాగ‌స్వామి జేడీఎస్‌, జ‌మ్మూకాశ్మీర్ లోని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, మ‌హారాష్ట్రలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ... ఇలా యూపీఏలో ఇప్ప‌టిదాకా భాగ‌స్వాములుగా లేని పార్టీల‌న్నీ కూడా ఇప్పుడు ఆ కూట‌మికి ద‌గ్గ‌ర‌గా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ కూట‌మి చుక్కానీ... కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే ఛాన్స్ లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే... ఇప్ప‌టికే కూట‌మిలో ఉన్న‌పార్టీల‌తోనే స‌రిగ్గా నెట్టుకురాలేక‌పోతున్న కాంగ్రెస్‌... ఇలా కొత్త మిత్రుల‌ను ఒక్క‌ద‌రికి చేర్చ‌డం ఆ పార్టీకి దుస్సాధ్య‌మే. మ‌రి ఇప్పుడు ఈ పార్టీల‌ను ఒక్క‌తాటిపైకి చేరుస్తున్న నేత ఎవ‌రు? ఇంకెవ‌రు... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడే. అంటే... ఇప్ప‌టికే యూపీఏ కూట‌మిలోని పార్టీల‌తో పాటు కొత్త‌గా ఆ కూట‌మి ద‌గ్గ‌రికి జ‌రిగిన‌, జ‌రుగుతున్న పార్టీల‌ను ఒక్క ద‌రికి చేర్చ‌డంలో చంద్ర‌బాబే కీల‌క భూమిక పోషిస్తున్నారు. మ‌రి కూట‌మి క‌ల‌కాలం క‌లిసే ఉండాలంటే... ఇలాంటి నేత‌కే ఆ కూట‌మి ప‌గ్గాలు ద‌క్కాలి.

ఈ లెక్క‌లేసుకున్న మీద‌టే... తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లా, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ లాంటి నేత‌లంతా యూపీఏ చైర్మ‌న్ గా చంద్ర‌బాబు ఉంటేనే బాగుంటుంద‌ని ఓ కొత్త ప్ర‌తిపాదన పెట్టార‌ట‌. ఈ ప్ర‌తిపాద‌న‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేద‌ని స‌మాచారం. అంటే... యూపీఏకు చైర్ ప‌ర్స‌న్ గా గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన సోనియా గాంధీ స్థానాన్ని కైవ‌సం చేసుకోనున్న చంద్ర‌బాబు... జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన చ‌క్రం తిప్పుతార‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English