రాహుల్ ఉచ్చులో మోదీ ఇరుక్కున్నట్టే!

రాహుల్ ఉచ్చులో మోదీ ఇరుక్కున్నట్టే!

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ... పెద్ద‌గా వ్య‌వ‌హారం తెలియ‌ని నేత‌గానే ముద్ర వేసుకున్నారు. గ‌డ‌చిన ఎన్నికల్లో ఏకంగా యూపీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రాహుల్‌... న‌రేంద్ర మోదీ మేనియా ముందు టపాసులా పేలిపోయారు. ఇది జ‌రిగి అప్పుడే ఐదేళ్లు అయిపోయింది. మ‌రోమారు ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే ఐదేళ్లు గ‌డిచినా రాహుల్ వ్య‌వ‌హారంలో పెద్ద‌గా మార్పు రాలేద‌న్న వాద‌నే వినిపించింది. అయితే ఇప్పుడు మాట‌ల మాంత్రికుడిగా పేరున్న న‌రేంద్ర మోదీని త‌న‌దైన శైలి ఉచ్చు బిగించి ఇరికించ‌డంలో రాహుల్ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. అదెలాగో చూద్దాం ప‌దండి.

ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌తిష్ఠను అధోఃపాతాళానికి దిగ‌జార్చిన అంశంగా ఉన్న రాఫెల్ డీల్ పై గ‌త కొంత‌కాలంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రాహుల్ గాంధీ... ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయిన వేళ...  చౌకీదార్ చోర్ హై అంటూ కొత్త నినాదాన్ని అందుకోవ‌డంతో పాటు దానిని బాగానే జ‌నాల్లోకి తీసుకెళ్లారు. ఈ నినాదంతో రాహుల్ కొంత‌మేర ఇబ్బంది ప‌డినా పెద్ద‌గా ఆలోచించ‌లేదు. సుప్రీంకోర్టుకు సారీ చెప్పి కూడా తాను కోర్టుకు మాత్ర‌మే సారీ చెప్పాన‌ని, మోదీపై తాను సంధించిన చోర్ కామెంట్ల‌కు క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని త‌న‌దైన శైలి వ్యూహం అమ‌లు చేశారు.

దీంతో స‌హ‌నం న‌శించిన మోదీ... రాహుల్ ను టార్గెట్ చేసే క్ర‌మంలో దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీని లాగేశారు. రాజీవ్ అవినీతి సామ్రాట్ గానే చ‌నిపోయార‌ని సంచ‌ల‌న కామెంట్ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా దేశ భ‌ద్ర‌త‌కు వినియోగించే ఐఎస్ఎస్ విరాట్ ను త‌న జ‌ల్సాల కోసం వినియోగించార‌ని కూడా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఇక్క‌డే రాహుల్ త‌న‌దైన శైలి వ్యూహాన్ని అమ‌లు చేసి మోదీపై న‌లుదిశ‌లా దాడి జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డని రాజీవ్ ను వివాదంలోకి లాగుతారా? అంటూ ఇప్పుడు అన్ని వ‌ర్గాల నుంచి మోదీపైకి విమ‌ర్శ‌లు దూసుకువ‌చ్చేశాయి.

అయినా ఇందులో రాహుల్ వ్యూహం ఏమిట‌న్న విష‌యానికి వస్తే... ఇప్పుడు మోదీ స‌ర్కారుకు రాఫెల్ డీల్ ఎలా న‌ష్టం చేసిందో... రాజీవ్ హ‌యాంలో కాంగ్రెస్ కు బోఫోర్స్ కుంభ‌కోణం కూడా దెబ్బేసింద‌నే చెప్పాలి. అయితే ఆ కేసును కోర్టులు కొట్టివేశాయి. ఇదే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను రాఫెల్ పై వ‌రుస‌గా దాడి చేస్తే... స‌హ‌నం న‌శించిన స్థితిలో మోదీ కూడా బోఫోర్స్ ఎత్తుకోక‌పోరు... ఏదో ఒక దిగ‌జారుడు కామెంట్ చేయ‌క‌పోతారా? అని భావించిన రాహుల్‌... రాఫెల్ ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించార‌ట‌. రాహుల్ వ్యూహం మేర‌కే మోదీ ఇప్పుడు రాజీవ్ పై అన‌వ‌స‌ర కామెంట్ చేసి ఇరుక్కుప‌సోయారు. మొత్తంగా ఈ విష‌యంలో రాహుల్ మాత్రం చాలా తెలివిగా వ్యూహం ర‌చిస్తే.... ఆ ఉచ్చులో మోదీ లాంటి నేత అడ్డంగా ప‌డిపోయార‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English