ఫెడరల్ ఫ్రంట్ ని ఎందుకు నిలబడదో చెప్పేశాడు

ఫెడరల్ ఫ్రంట్ ని ఎందుకు నిలబడదో చెప్పేశాడు

ఫెడరల్ ఫ్రంట్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరని ఒక కలగా మిగిలిపోతుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. దీనికి కారణం... కేసీఆర్ ఒక అవకాశ వాది అని, ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు. అందుకే అతని జట్టులో ఎవరూ చేరనపుడు ఆ ఫెడరల్ ఫ్రంట్ నిలబడే ప్రసక్తే లేదన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ ఇప్పటికే చాలాసార్లు ఫెయిలయ్యింది, ఇంకోసారి అసలు ఏర్పడదన్నారు. కేవలం కేసీఆర్ ఆయా పార్టీ నేతలను కలిసినంత మాత్రాన వారంతా కేసీఆర్ తో ఉన్నారని భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ కూటమి, మరోటి కాంగ్రెస్ కూటమి. అన్ని పార్టీలు వీటిలో ఏదో ఒకదాని చేరబోతున్నాయి అన్నారు.

తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ ఒక అత్యాశ అన్నారు.  ఈ రాజకీయ  పర్యటనలు అన్ని ఒక నాటకం అన్నారు. దేశంలో 22 పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం ఆ కూటమి అధికారంలోకి రానుంది... అని కోదండరాం వ్యాఖ్యానించారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కాదని చెప్పను, కానీ ఏర్పడినా దాని ప్రభావం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందులో చంద్రశేఖర్ రావు పార్టీ టీఆర్ఎస్, వైఎస్ జగన్ పార్టీ వైసీపీ మాత్రమే ఉంటాయి. అంటే ఇది కేవలం తెలుగు ఫ్రంట్ గా మిగిలిపోతుందని కోదండరాంఅభిప్రాయపడ్డారు. ఈ ఫ్రంట్ పేరుతో కాలయాపన తప్ప ఉపయోగం లేదు. కాబట్టి కాస్త తెలంగాణ సమస్యలపై దృష్టిపెట్టాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కోదండరాం హితవు పలికారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English