మోడీ విభజన వాది - ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్

మోడీ విభజన వాది - ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్

ఒక మనిషి గురించి ఒక వాక్యం రాసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నోరు జారిన మాట తిరిగి తీసుకోలేం. బహుశా ఈ విషయం ప్రఖ్యాత ’టైమ్‘ మ్యాగజైన్ కి తెలిసి ఉండదని ఎవరైనా భావించగలరా? అసంభవం. మరి ఎన్నికల సమయంలో టైమ్ మ్యాగజైన్ ‘‘భారతదేశపు డివైడర్ (ఇండియాస్ డివైడర్ ఇన్ ఛీఫ్)’’ అంటూ వ్యాఖ్యానించింది.  మోడీపై కవర్ స్టోరీ రాసింది. దానికి సరిగ్గా సరిపోయే ఓర కంట చూపు ఫొటోను కూడా కవర్ పేజీపై వేస్తూ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. ఈ కవర్ స్టోరీ రాసిన కాలమిస్ట్ మరియు జర్నలిస్ట్ ఆతీష్ తాసీర్ (ఇతను బ్రిటిష్ పౌరుడు. తల్లి ఇండియన్ జర్నలిస్ట్, తండ్రి పాకిస్తాన్ రాజకీయనాయకుడు).  ఒక్క అమెరికా తప్ప మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ ఇదే స్టోరీతో ఈనెల 20న ఈ మ్యాగజైన్ విడుదల కానుంది. అమెరికాకు మాత్రం డెమొక్రాట్ ఎలిజిబెత్ కవర్ స్టోరీతో ఎడిషన్ ప్రింట్ కానుంది.

ఇదిలా ఉంటే...ప్రధాని నరేంద్రమోడీని ఇంత పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఒక పత్రిక ఇలా రాయడం కొత్త. కానీ ప్రధాని కాక ముందు 2012లోనూ టైమ్ మ్యాగ్ నరేంద్రమోడీ గురించి ఓ కథనం రాసింది. అపుడు వివాదాలను ప్రేమించే రాజకీయా నాయకుడిగా వ్యాఖ్యానించింది.

టైమ్ తాజా కథనంపై మోడీని తిట్టారు అని భక్స్త్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఇతరులు కొందరు మోడీని బాగా అన్నారని సంతోషపడుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరి అభిప్రాయం తప్పు. ప్రస్తుతం ఇంకా మూడు దశలు అది కూడా హిందుత్వ ప్రభావం ఉండే ఏరియాల్లో ఎన్నికలు జరుగుతున్నపుడు మోడీ హిందు - ముస్లిం విభజన కర్తగా వ్యాఖ్యానించడం మోడీకి ఎన్నో కొన్ని ఓట్లు సాధించిపెట్టేదే గాని మోడీకి నష్టం చేయదు. ఈ విషయం అర్థమైన వాళ్లు బహుశా మోడీ ఆ పత్రికతో కావాలని ఇలా రాయించారని ఆరోపించే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే మోడీ కోరుకుంటున్నది అదే ముద్ర. కానీ వాస్తవంలో అతను ఫక్తు రాజకీయ నేత. ఎప్పటికే అలయన్స్ ముఖ్యమో అప్పటికి ఆ వ్యక్తులను వ్యూహాత్మకంగా చేరదీయగలిగిన వ్యూహకర్త.

కాబట్టి ఆ స్టోరీ ఇంపాక్ట్ పక్కన పెడితే... మోడీకి టైమ్ మ్యాగ్ ఇచ్చిన బిరుదు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మతపరంగా ఇండియాను విభజించి పాలిస్తున్న నేతగా ఏకంగా ప్రధానిని వ్యాఖ్యానిస్తే అది వైరల్ కాకుండా ఉంటుందా? ఇకపోతే ఆ స్టోరీలో గుజరాత్ అల్లర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English