నాని, రోజాల‌కు ఒట‌మి త‌ప్ప‌దా?

నాని, రోజాల‌కు ఒట‌మి త‌ప్ప‌దా?

ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో లెక్క‌లేనన్ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. గ‌త నెల పోలింగ్ ముగియ‌గా... ఈ నెల 23న ఫ‌లితాలు రానున్న సంగ‌తి తెలిసిందే. 2014లో మాదిరిగానే ఇప్పుడు కూడా విప‌క్ష వైసీపీకి విజ‌యం ఖాయ‌మేన‌ని చాలా స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌డితే... ఆయ‌న కేబినెట్ లో ఎవ‌రెవ‌రికి ఏఏ పొర్టు ఫోలియోలు ద‌క్కుతాయోన‌న్న విష‌యంపైనా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఎవ‌రికి వారే త‌మ‌దైన లెక్క‌లేసుకుంటున్న ద్వితీయ శ్రేణి నేత‌లు... జ‌గ‌న్ కేబినెట్ త‌మ నేత‌కు ఈ శాఖ అని ఇప్ప‌టికే సంబ‌రాలు మొద‌లెట్టేశారు.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బ‌రిలోకి దిగిన కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)కి జ‌గ‌న్ కేబినెట్ లో హోం శాఖ ఖాయ‌మ‌ని కొంద‌రు... చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి బ‌రిలోకి దిగిన ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాకు ఆ శాఖ ద‌క్కుతుంద‌ని మ‌రికొంద‌రు అంచనా వేస్తున్నారు. అయితే వీరిద్ద‌రికీ ఈ ద‌ఫా గెలుపు అంత వీజీ కాద‌న్న మాట కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది. గుడివాడ‌లో దేవినేని అవినాశ్... నానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇప్ప‌టికే మూడు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని.. ఈ సారి మాత్రం ఎదురీద‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో న‌గ‌రి నుంచి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారుడు గాలి భాను ప్ర‌కాశ్... రోజాకు గ‌ట్టి పోటీ ఇచ్చార‌న్న విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. మ‌రోవైపు న‌గ‌రిలో మంచి ప‌ట్టు ఉన్న చెంగారెడ్డి ఫ్యామిలీ కూడా రోజాకు వ్య‌తిరేకంగా ప‌నిచేసింద‌ని కూడా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా రోజాకు న‌గ‌రిలో గెలుపు అంత ఈజీ కాద‌న్న మాట వినిపిస్తోంది. ఈ లెక్క‌న వైసీపీ కేబినెట్ లో హోం మినిస్ట‌ర్లుగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఇద్ద‌రు నేత‌లు... ఓడితే... ఆ పోస్టు ఇంకెవ‌రికి ద‌క్కుతుంద‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English