కేసీఆర్ ను ఏకిపడేశాడే !

కేసీఆర్ ను ఏకిపడేశాడే !

స‌హ‌జంగా సౌమ్యంగా మాట్లాడేవారు కొంద‌రుంటారు. అలాంటి వారు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం అరుదు. అలా అరుదుగా చేసిన వ్యాఖ్య‌లే సంచ‌ల‌నంగా మారుతుంటాయి. సౌమ్యుడిగా పేరున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌త కొద్దికాలంగా ఆయ‌న డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరవదిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంత‌రం, అరెస్టు చేస్తే...నిమ్స్ ఆస్ప‌త్రిలో కూడా బ‌ల‌వంతంగా దీక్ష కొన‌సాగించారు. అలా ఇంట‌ర్ విద్యార్థుల విష‌యంలో ఆందోళ‌న‌లు చేసిన ల‌క్ష్మ‌ణ్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

హైదరాబాద్ హిమాయత్ నగర్‌ని బీసీ సాధికారత భవన్‌లో విశ్వబ్రాహ్మణ మనుమయా సంఘం ఆధ్వర్యంలో జగద్గురు అదిశంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు ఇంటర్ రిజల్ట్ ను వారి పెంపుడు కుక్కలకు కాంట్రాక్టుగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం..ఓ కుటుంబం గుప్పిట్లో నలిగిపోతుందని విమర్శించారు. యువకుల బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యార్థులే బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. గ్లోబరీనా సంస్థ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమండ్‌ చేశారు.

రాజకీయాలను డబ్బు శాసిస్తోందని ల‌క్ష్మ‌ణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డబ్బును అక్రమంగా సంపాదించిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే వారిని ప్రజలు ఆదరిస్తున్నప్పటికి చివరి నిమిషంలో డబ్బు ప్రధాన పాత్ర పోషించడంతో ఓడిపోతున్నారన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English