ఇదే జరిగితే కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ గుడ్‌బై..?

ఇదే జరిగితే కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ గుడ్‌బై..?

తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తూనే ఉంది. గత డిసెంబర్‌లోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగగా, ఆ తర్వాత పంచాయతీ, కొద్దిరోజుల క్రితం లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. వీటి ఫలితాలు ఇంకా రాక ముందే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంతలోనే తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అంతేకాదు, 7వ తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. మే 31న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

 స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నుంచి మండలికి ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న వీరిలో నరేందర్‌రెడ్డి కొడంగల్‌, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి శాసనసభ్యులుగా ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో మురళీధర్‌రావు తన సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ కారణంగానే ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన చిక్కు వచ్చి పడిందట.

 నల్గొండ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ మేరకు రాష్ట్ర నేతలకు కూడా సంకేతాలు వచ్చాయి. కానీ, రెండు రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పేరు వినిపిస్తోంది. దీనికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్‌ అని తెలుస్తోంది. తమ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ సారి తమ కుటుంబానికే అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ఈ సోదరులు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద డిమాండ్ చేశారని తెలిసింది. ఒకవేళ తమను కాదని వేరే వాళ్లకు కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ కారణంగానే లక్ష్మి పేరు తెరపైకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, నల్గొండ నుంచి పోటీ చేసిన వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English