పాక్ ప్ర‌జ‌ల‌కు నో ఎంట్రీ...స్టార్ హోట‌ల్ సంచ‌ల‌నం

పాక్ ప్ర‌జ‌ల‌కు నో ఎంట్రీ...స్టార్ హోట‌ల్ సంచ‌ల‌నం

స‌హ‌జంగా, ఆతిథ్య రంగంలో ఉండే వారు వివాదాల‌కు దూరంగా ఉంటారు. దేశాల మ‌ధ్య విబేధాల‌కు వారు దూరంగా ఉంటారు .అయితే, ఓ ప్ర‌ముఖ హోటల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వంపై అంతటా వ్యతిరేకత కనిపిస్తూనే ఉన్న నేప‌థ్యంలో....పాకిస్థానీల‌కు నో ఎంట్రీ చెప్తోంది. ఈ మేర‌కు ఏకంగా బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది.

పుల్వామ‌లో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల చ‌ర్య‌ల వ‌ల్ల 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు అయిన సంగ‌తి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని భారత్ చేస్తున్న వాదనకు ప్రపంచం మద్దతు పలికింది. ఇటీవలే .. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

మ‌రోవైపు  పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని.. వారిని ఎటువంటి సహాయం అందివ్వడానికి వీల్లేదని జనం అంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేవరకు పాకిస్థానీలను ఇండియాలోకి అనమతించొద్దని కూడా కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ లో పాకిస్థానీలకు నో ఎంట్రీ చెబుతూ ఓ హోటల్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

హోటల్ మిలాన్ ప్యాలెస్ అనే ప్రముఖ హోటల్  ప్రయాగరాజ్‌లో  ఉంది. తమ హోటల్ కు పాకిస్థాన్ దేశస్తులు రావొద్దని.. వచ్చినా వారికి ఎటువంటి రూమ్స్ ఇచ్చేదిలేదంటూ ఫ్రంట్ ఆఫీస్ లో ఓ నోటీస్ పెట్టింది. పుల్వామా దాడి నేప‌థ్యంలో ఈ నోటీసు పెట్టామని..దానినే కొనసాగిస్తున్నామని హోటల్ మేనేజర్ చెప్పారు. కాగా, ఈనోటీసు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English