మ‌ళ్లీ సీఎస్ ఉద్రిక్త‌త‌ను పెంచుతున్నారా?

మ‌ళ్లీ సీఎస్ ఉద్రిక్త‌త‌ను పెంచుతున్నారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే వారెవ‌రు? దాదాపు న‌ల‌భై రోజుల పాటు సామాన్యుల‌ను ప‌ట్టించుకునే నాథుడెవ‌రు ఈ ప్ర‌శ్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌హజంగానే తెర‌మీద‌కు వ‌స్తుంది. ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ముఖ్య‌మంత్రిగా తాను ప‌రిష్కారం చూపుతాన‌ని ప్ర‌శ్నించిన ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కోడ్ అడ్డంకిగా మారుతోంది. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్ణ‌యంతో తాజాగా మ‌రోమారు క‌ల‌కలం మొద‌లైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన కేబినెట్ విషయంలో తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం ఏపీ సీఎస్ తీసుకున్నారు.

కేబినెట్ స‌మావేశం నేప‌థ్యంలో, సీఎంఓ, జీఏడీ పొలిటికల్ కార్యదర్శులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. అనంత‌రం ఆయ‌న ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది భేటీ అయ్యారు. ఈనెల 10న కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎంఓ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ పంపిన అంశంపై చ‌ర్చించారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌ని ఈ ఇద్ద‌రు నేత‌ల స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందని… అజెండాలో అంశాలపై ఈసీ అనుమతి ఇస్తేనే భేటీ ఉంటుందని సీఎస్ తేల్చిచెప్పారు. ఇక ఎన్నికల కోడ్ ను అనుసరించే మంత్రివర్గ సమావేశం ఉండాలని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది సైతం సీఎస్ ఫీడ్ బ్యాక్ అనుస‌రించి వెల్ల‌డించారు. కోడ్ ప్రకారమే నేతలు, అధికారులు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. 10న జరిగే భేటీని వాయిదా వేయటంతో.. ఈనెల 14న కేబినేట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. మ‌రి ఈ నూత‌న తేదీ విష‌యంలో అయినా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ఉంటుందా?  లేక సీఎస్ మ‌ళ్లీ ఏదైనా అవాంత‌రాలు వ్య‌క్తం చేస్తారా? అనే ఉత్కంఠ స‌హ‌జంగానే  తెర‌మీద‌కు వ‌స్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English