కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన స్టాలిన్‌

కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన స్టాలిన్‌

తెలంగాణ‌ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా, కేరళ, తమిళనాడు పర్యటనకు సిద్ధ‌మై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కేసీఆర్‌కు ఆ త‌దుప‌రి స‌మావేశం గురించి ఊహించ‌ని స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. తాను యోచిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి చ‌ర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోర‌గా....తమిళ‌నాడు విప‌క్ష నేత స్టాలిన్ మొహం చాటేశారు. కేసీఆర్‌తో భేటీకి నో చెప్పారు. ఆఖ‌రికి ఈ విష‌యంలో అధికారిక స‌మాచారం సైతం ఇవ్వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితర నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయి కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. ఎన్నికలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తన పర్యటన మళ్లీ మొదలు పెట్టారు. ముందుగా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ దఫా కేసీఆర్ తన పర్యటనను కేరళ రాష్ట్రం నుంచే ప్రారంభించారు. ఈనెల 13న చెన్నైలో డీ ఎంకే అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, కేసీఆర్‌తో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నాయి.

మే 19న జరిగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టాలిన్ బిజీగా ఉన్నారని, అందుకే కేసీఆర్‌తో స‌మావేశం క‌ష్ట‌మేన‌ని డీఎంకే వ‌ర్గాలు అంటున్నాయి. అయితే, ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌స్తే...ఆయ‌న‌తో స‌మావేశం అయ్యేంత తీరిక లేకుండా ఉన్నారని డీఎంకే స్పష్టం చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం ప్ర‌చారం అంశం కాక‌పోవ‌చ్చున‌ని ప‌లువురు అంటున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడం ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English