బాబే సీఎం!... లేదంటే జ్యోతిష్యం వ‌దిలేస్తార‌ట‌!

బాబే సీఎం!... లేదంటే జ్యోతిష్యం వ‌దిలేస్తార‌ట‌!

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిద‌న్న విష‌యం తేలేందుకు ఇంకా 15 రోజుల‌కు పైగానే ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఇటు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ కూడా గెలుపు త‌మ‌దంటే... కాదు త‌మ‌ద‌ని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని స‌ర్వేలు టీడీపీకి, మ‌రికొన్ని స‌ర్వేలు వైసీపీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి. ఈ విష‌యంలో చివ‌ర‌కు జ్యోతిష్యులు కూడా కొంద‌రు వైసీపీ వైపు మొగ్గితే... మ‌రికొంద‌రు టీడీపీ వైపు మొగ్గారు.

ఇలాంటి జ్యోతిష్యాల్లో ఇప్పుడు మ‌రో ఆసక్తిక‌ర జ్యోతిష్యం వ‌చ్చేసింది. టీడీపీకి 112 సీట్లు ఖాయ‌మ‌ని, చంద్ర‌బాబు సీఎం కావ‌డం ఖాయ‌మని ఈ జ్యోతిష్యం చెప్పేస్తోంది. మ‌రి ఈ జ్యోతిష్యాన్ని చెప్పిన పండితులు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే...  ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి ఈ జ్యోతిష్యాన్ని చెప్పారు.

తాను చెప్పిన ప్ర‌కారం చంద్ర‌బాబు సీఎం కాక‌పోతే... ఏకంగా తాను జ్యోతిష్యం చెప్ప‌డ‌మే మానేస్తాన‌ని కూడా ఈయ‌న‌ పేర్కొన్నారు . ఇంకో అడుగు ముందుకేసిన ఈయ‌న అవ‌స‌ర‌మైతే... ఈ  విషయాన్ని తాను రూ.100 బాండ్ పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మొత్తంగా చంద్ర‌బాబు గెల‌వ‌డం ఖాయ‌మ‌ని శాస్త్రి చెప్పేశారు. మ‌రి ఈయ‌న‌గారి జ్యోతిష్యం ఎంత‌మేర వాస్త‌వ‌మో 23న గానీ తేల‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English