కేర‌ళ‌కు కేసీఆర్‌!... వాటీజ్ గోయింగ్ ఆన్‌!

కేర‌ళ‌కు కేసీఆర్‌!... వాటీజ్ గోయింగ్ ఆన్‌!

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రోసారి ఆస‌క్తి రేకెత్తించేస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లుగా ఇదివ‌ర‌కే ఓ ఫీల‌ర్ వ‌దిలిన కేసీఆర్‌.. భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట ఓ కూటమిని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ కూట‌మి ఏర్పాట్ల‌లో భాగంగా ఆయ‌న అప్పుడు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్ ల‌కు వెళ్లి వ‌చ్చారు. ఆ ప‌ర్య‌ట‌న‌ల్లో కేసీఆర్ కు పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ప‌ర్య‌ట‌న‌ల్లాగే ఇంకో టూర్ కు కేసీఆర్ సిద్ధ‌మైపోయార‌ట‌. ఈ సారి క‌మ్యూనిస్టుల కోట కేర‌ళ‌కు వెళుతున్నారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేర‌నున్న కేసీఆర్ సాయంత్రానికంతా కేర‌ళ చేరుకుని తిరువ‌నంత‌పురంలో కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తో భేటీ అవుతార‌ట‌. ఈ భేటీ ఎజెండా ఏమిట‌న్న విష‌యం ఇప్ప‌టిదాకా వెల్ల‌డి కాకున్నా... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గానే ఆ ఎజెండా ఉంటుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే... ఈ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ వెంట ఆయ‌న ఫ్యామిలీ కూడా ఉంద‌ట‌. మొత్తం ఫ్యామిలీతో క‌లిసి ఫ్లైటెక్కనున్న కేసీఆర్‌... కేర‌ళ‌లోని రామేశ్వరం , శ్రీరంగం దేవాలయాలను కూడ సందర్శించనున్నారట‌. అంతేకాకుండా ఏకంగా మూడు రోజుల పాటు ఆయ‌న కేర‌ళ‌లోనే ఉంటార‌ట‌. ఈ నేప‌థ్యంలో అస‌లు కేసీఆర్ సాగించ‌నున్న టూర్‌... పొలిటిక‌ల్ టూరా?  లేదంటే ఫ్యామిలీతో క‌లిసి జాలీ టూరా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English