మోదీ వ‌ల్ల ఈసీ చీలిపోయిందా?

మోదీ వ‌ల్ల ఈసీ చీలిపోయిందా?

జాతీయ స్థాయిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ మొద‌లుకొని ఇటీవ‌ల జాతీయ స్థాయిలో గ‌ళం వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అనేక సంద‌ర్భాల్లో ఆరోపిస్తున్న‌ట్లు...రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన సంస్థ‌ల‌పై దాడి జ‌రుగుతోంద‌ని, వాటి ప‌నితీరును తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీన్ని నిజం చేస్తున్న‌ట్లు తాజాగా అత్యున్న‌త రాజ్యాంగబ‌ద్ద వేదిక‌లో చీలిక వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగాల విష‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో విస్ప‌ష్ట‌మైన విబేధాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ నెల‌లో మోదీ చేసిన ప్ర‌సంగాలు ఈ చీలిక‌కు కార‌ణం అంటున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 1న వార్దాలో ప్ర‌సంగిస్తూ మైనారిటీలు ఎక్కువగా ఉండే వయనాడ్‌ నుంచి  కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయడంపై విమర్శలు గుప్పించారు. అలాగే ఏప్రిల్‌ 9న లాటూర్‌లో పుల్వామా, బాలాకోట్‌ ఘటనలను ప్రస్తావిస్తూ తొలిసారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించాయి.

దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్‌ చివరకు అంతా ఓకే అంటూ ప్రధాని మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసిందని, మోదీకి వ్యతిరేకంగా ఒక కమిషనర్‌ అభిప్రాయం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ 2:1 మెజారిటీతో నిర్ణయం వెలువరించినట్లు స‌మాచారం.

మహారాష్ట్రలో గత నెలలో రెండు ఎన్నికల ప్రసంగాలకు సంబంధించి మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చే అంశంపై వ‌చ్చిన ఫిర్యాదులపై సీఈసీ సునీల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ తీవ్రంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచ‌చారం. అయితే, మోదీ చేసిన ప్రసంగానికి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఎన్నికల కమిషనర్లలో ఒకరు వ్యతిరేకించడం సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English