టీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్‌...స‌కుటుంబంగా జెడ్పీ బ‌రిలో

టీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్‌...స‌కుటుంబంగా జెడ్పీ బ‌రిలో

తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం జ‌రుగుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే, ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు `కుటుంబ పాల‌న నేత‌`గా విప‌క్షాలు, విశ్లేష‌కులు పేర్కొంటుంటే....తాజాగా టీఆర్ఎస్‌లోని ముఖ్య నేత‌లు సైతం ఇదే ట్రెండ్ ప్ర‌కారం న‌డుచుకుంటున్నారని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా పరిష‌త్ ఎన్నిక‌ల్లో చోటుచేసుకుంటున్న ఇదే స‌కుటుంబ రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌స్తోంది. ముఖ్య నేత‌ల భార్య‌లు, కుమారులు, కుటుంబ స‌భ్యులు, కోడ‌ల్లు, కూతుల్లు...ఇలా ప‌రివారం అంతా ప‌రిష‌త్ పోరులో బిజీ అవుతోంది.

రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డిని, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ఆయన భార్య‌ గండ్ర జ్యోతిని టీఆర్ఎస్‌ బరిలోకి దింపింది. మహబూబ్‌నగర్ జడ్పీ చైర్మన్ జనరల్‌కు రిజర్వు కావడంతో అమరచింత మాజీ ఎమ్మెల్యే, నవలా రచయిత్రి స్వర్ణా సుధాకర్‌రెడ్డిని బరిలోకి దించింది. యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వు కావడంతో అక్కడి నుంచి మాజీ మంత్రి ఏలిమినేటి ఉమామాదవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డిని బరిలోకి దింపింది. మంచిర్యాల జడ్పీ చైర్మన్ పదవి ఎస్‌సీ మహిళకు రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని బరిలోకి దింపింది.

అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో త‌న ముద్ర వేసుకుంటోంది. నల్లగొండ జడ్పీ చైర్మన్ జనరల్‌కు రిజర్వు కావడంతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్మన్ ఎస్‌సీకి రిజర్వు కావడంతో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భార్య అనురాధ వంశీకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. యాదాద్రి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English