ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌నం!... మోదీ ఎవ‌రండీ?

ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌నం!... మోదీ ఎవ‌రండీ?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓ వైపు మాట‌ల మంట‌లు రేగుతుంటే... మ‌రోవైపు సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నాలైన ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చేస్తున్నాయి. అతివాద నేతలుగా ముద్ర‌ప‌డిన పార్టీలు, ఆ పార్టీల నేత‌లు నిత్యం ఘాటు వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో వ్య‌క్తులుగా నిలుస్తుంటే... సామాజిక స్పృహ ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్న నేత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ  ప్ర‌ధాని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అన్న తేడా లేకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో బ‌హుబాషా చిత్రాల న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ త‌ర‌హాలోనే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

త‌న సొంత రాష్ట్రం క‌ర్ణాట‌క నుంచి ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగిన ప్ర‌కాశ్ రాజ్‌... త‌న భావ‌జాలంతో స‌రిపోలిన పార్టీల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలో అధికార పార్గీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప్ర‌కాశ్ రాజ్‌... ఆ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప్ర‌చారం చేసేందుకు ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలుగు మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ క్ర‌మంలో మీడియా నుంచి దూసుకువ‌చ్చిన ఓ ప్రశ్న‌కు చాలా వేగంగా స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌... మోదీ ఎవ‌రండీ? (హూ ఈజ్ మోదీ) అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఇటు బీజేపీ గానీ, అటు కాంగ్రెస్ పార్టీ గానీ విజ‌యం సాధించే అవ‌కాశాలు లేవ‌ని చెప్పిన ప్ర‌కాశ్ రాజ్‌... ఢిల్లీ గ‌ద్దెనెక్కేది సంకీర్ణ స‌ర్కారేన‌ని తేల్చి చెప్పారు.

ఈ క్ర‌మంలోనే అత్యంత బ‌ల‌వంతుడిగా ఉన్న మోదీని ఓడించ‌డం సాధ్య‌మేనా? అన్న ప్ర‌శ్న రాగానే... వేగంగా స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌... మోదీ ఎవ‌రండీ అంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. అస‌లు మోదీకి వ‌చ్చే ఓటింగ్ ఎంత? అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశంలోని ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని, ఆ మార్పు ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిఫ‌లించ‌బోతోంద‌ని కూడా ప్ర‌కాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ప్ర‌జ‌ల మనోభావాల‌కు అనుగుణంగానే ముందుకు సాగుతున్నందున‌నే తాను ఆప్ అభ్య‌ర్థుల విజయం కోసం ప్ర‌చారం చేస్తున్నాన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. చాలా అంశాల‌పైనే త‌న‌దైన శైలిలో మాట్లాడిన ప్ర‌కాశ్ రాజ్‌... మోదీ ఎర‌వంటూ ప్ర‌శ్నించి పెను సంచ‌ల‌న‌మే రేపార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English