ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేవు కానీ ప్ర‌ధాని అవుతావా కేసీఆర్‌?

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేవు కానీ ప్ర‌ధాని అవుతావా కేసీఆర్‌?

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో గంద‌ర‌గోళం, విద్యార్థులు అనేక మంది ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం తెలంగాణ‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విప‌క్షాలు అన్నీ రోడ్డెక్కాయి. విద్యార్థి సంఘాలు ఆందోళ‌నలు కొన‌సాగిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఆరు రోజుల అనంత‌రం ఆయ‌న దీక్ష విర‌మించారు. మ‌రోవైపు ఇంటర్ బోర్డ్ అక్ర‌మాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపుచ్చాయి. అడ్డుకున్న పోలీసులు, వామ‌ప‌క్షాల నేతలకు మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇలాంటి ప‌రిణామాలు కొన‌సాగుతున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌ను చేప‌ట్టారు.

గాంధీభవన్‌ ఆవరణలో యూత్‌ కాంగ్రెస్‌, విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో 48 గంటల దీక్ష చేప‌ట్టింది.  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్,మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య త‌దిత‌రులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.  ఇంటర్‌ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నా రని  మధుయాష్కీగౌడ్‌ ప్రశ్నిం చారు. మానవత్వం లేని ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరీశ్‌రావులకు కార్పొరేట్‌ ముడుపులు ముట్టడం వల్లే ఇంటర్‌ అవకతవకలపై మాట్లాడటంలేదని ఆరోపించారు. ఇంటర్‌ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ దీక్షల పేరుతో హడావుడి చేస్తున్నదని యాష్కీ మండిప‌డ్డారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంటర్‌ ఫలితాల అవకతవకల కారణంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి అధికారి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అసమర్ధుడు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావడం మన దురదష్టమన్నారు. కమిషన్‌లు వచ్చే వాటిపై కేసీఆర్‌ సమీక్షలు చేస్తాడు తప్ప మిగతా వాటిపై సమీక్షలు చేయరని విమర్శించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించలేని కేసీఆర్‌ ప్రధాన మంత్రి ఎలా అవుతార‌ని ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English