ఫ‌ణి ఎఫెక్ట్‌!... జ‌గ‌న్ కూ త‌గిలిందే!

ఫ‌ణి ఎఫెక్ట్‌!... జ‌గ‌న్ కూ త‌గిలిందే!

ఒడిశాతో పాటు ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీ‌కాకుళం జిల్లాపై విరుచుకుప‌డ్డ ఫ‌ణి తుఫాను... ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా ప్ర‌భావం చూపించేసిందనే చెప్పాలి. ఫ‌ణి తుఫాను ప్ర‌భావంతో రాష్ట్రంలో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుంటే... ఫారిన్ టూర్లంటూ తిరగడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మంటూ కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ నిన్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. లండ‌న్ లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుతున్న త‌న కుమార్తెను చూసి వచ్చేందుకు ఓ ప‌ది రోజుల పాటు షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్న జ‌గ‌న్‌... ఫ‌ణి తుఫాను నేప‌థ్యంలో ఆ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

ఒక‌టి, రెండు రోజుల్లో ఆయన ఫ‌ణి ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. తొలుత సుదీర్ఘ పాద‌యాత్ర‌, ఆ త‌ర్వాత వెనువెంట‌నే సుదీర్ఘ షెడ్యూల్ తో కూడిన ఎన్నిక‌ల షెడ్యూల్ తో ఓ ద‌ఫా లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్‌... హ‌డావిడిగానే త‌న టూర్ ను ముగించుకున్నారు. ఇక ఇప్పుడు పోలింగ్ ముగిసిపోవ‌డం, ఫ‌లితాల‌కు ఇంకా 20 రోజుల స‌మ‌యం ఉండ‌టంతో ఓ ప‌ది రోజుల పాటు లండ‌న్ టూర్ ను ఖ‌రారు చేసుకున్న జ‌గ‌న్‌... మొత్తం ఫ్యామిలీతో క‌లిసి కూతురు వ‌ద్ద‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా పోలింగ్ ముగియ‌డంతో ఫుల్ చిల్ మోడ్ లో ఉన్న జ‌గ‌న్‌... నిన్న అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమాకూ వెళ్లారు.

ఈ విష‌యంపై అధికార పార్టీ టీడీపీ నేత‌ల‌తో పాటు ఏకంగా ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ వైపు ఫ‌ణి తుఫాను కార‌ణంగా జ‌నం నానా ఇబ్బందులు ప‌డుతుంటే... జ‌గ‌న్ సినిమాకు వెళ‌తారా? అంటూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఇక తాను లండ‌న్ టూర్ కు వెళితే... మ‌రింత మేర విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ‌తాయ‌న్న భావ‌న‌తో ఆయన త‌న ఫారిన్ టూర్ ను ర‌ద్దు చేసుకున్నారు. మొత్తంగా ఫ‌ణి తుఫాను జ‌గ‌న్ లండ‌న్ టూర్ ను ఏకంగా ర‌ద్దు చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English