వైర‌ల్ పోస్టర్‌!.. ఈ పాపం ఎవ‌రిది?

వైర‌ల్ పోస్టర్‌!.. ఈ పాపం ఎవ‌రిది?

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు నిర్ల‌క్ష్యం కార‌ణంగా పెను దుమారే రేగింది. బోర్డు అధికారుల ఉదాసీన వైఖ‌రి కార‌ణంగా ఇప్ప‌టిదాకా తెలంగాణ‌లో 23 మంది ఇంట‌ర్ విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. బోర్డు నిష్క్రియాప‌ర‌త్వం, అనుభ‌వ లేమితో చ‌క్రం తిప్పిన గ్లోబ‌రినా సంస్థ‌ల వైపే వేళ్ల‌న్నీ చూపిస్తున్నా... ఈ ఘోరానికి అస‌లు కార‌కులు ఎవ‌ర‌న్న విష‌యంపై ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. ఎవ‌రికి తోచిన విధంగా వారు త‌మ త‌మ క‌న్ క్లూజ‌న్‌లు ఇస్తున్నారు.

ఇంట‌ర్ బోర్డుదే తప్పంటూ అందరి నోటా వినిపిస్తున్నా... చ‌ర్య‌లు మాత్రం శూన్య‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో అస‌లు దోషులు ఎవ‌ర‌న్న విష‌యంపై నాన్ స్టాప్ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో హైద‌రాబాద్ లోని దిల్‌సుఖ్ న‌గ‌ర్ లో వెల‌సిన ఓ పోస్ట‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంట‌ర్ వివాదంతో పాటుగా 23 మంది విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు అస‌లు కార‌కులు ఎవ‌రు? అంటూ వ‌రుస‌గా ప్ర‌శ్న‌లు సంధించిన ఈ పోస్ట‌ర్ దిల్ సుఖ్ న‌గ‌ర్ లోని వెంక‌టాద్రి థియేట‌ర్ స‌మీపంలో వెల‌సింది.

అయినా ఈ పోస్ట‌ర్ లో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... *23 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్మలకు బాధ్యులెవరు..? తల్లిదండ్రులా..? విద్యావ్యవస్థనా..? ఉపాధ్యాయులా..? ప్రభుత్వమా..?* అని ఉంది. *మేరా భారత్ మహాన్(ఎబీఎం)* పేరిట వెల‌సిన ఈ పోస్ట‌ర్ ను ఎవ‌రు పెట్టార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.... ఈ పోస్ట‌ర్ లో సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స్ట్రైట్ ఆన్స‌ర్ ల‌బిస్తుందా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English