ఎల్వీ డేర్‌!... సీఎంకే సింగిల్ లైన్ ఆన్సరిచ్చార‌ట‌!

ఎల్వీ డేర్‌!... సీఎంకే సింగిల్ లైన్ ఆన్సరిచ్చార‌ట‌!

ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం... ఏపీకి సీఎస్ గా ప‌నిచేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. దీని కంటే ముందుగా ఆ పేరు చెవిన ప‌డ‌గానే... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న అధికారే మ‌న‌కు గుర్తుకు వ‌స్తారు. ఈ కార‌ణంగానే ప్రస్తుతం ఏపీలో సీనియ‌ర్ మోస్ట్ ఐఏఎస్ అయినా... చంద్ర‌బాబు స‌ర్కారు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న కంటే జూనియ‌ర్ అయిన అనిల్ చంద్ర పునేఠ‌ను సీఎస్ గా నియ‌మించింది. అయితే ఎన్నిక‌ల కోడ్ పుణ్య‌మా? అంటూ పునేఠ‌పై వైసీపీ ఫిర్యాదు చేయ‌డంతో ఈసీ... పునేఠ ప్లేస్ లో ఎల్వీని నియ‌మించేసింది. స‌డెన్ గా, ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా చోటుచేసుకున్న ఈ ప‌రిణామంతో అంద‌రూ షాక్ తిన్నా... ఎల్వీ మాత్రం ఖుషీఖుషీ అయిపోయారు.

ఏపీ పాల‌న‌లో అప్ప‌టిదాకా పెద్దగా ఇబ్బందులు రాకున్నా... సీఎస్ గా ఎల్వీ ఎంట్రీ ఇచ్చిన మ‌రుక్ష‌ణ‌మే ప‌రిస్థితి అంతా మారిపోయింది. చంద్ర‌బాబుకు ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు వేస్తూ సాగారు. కోడ్ కు ఎవ‌రైనా త‌లొంచాల్సిందే కదా. చంద్ర‌బాబు కూడా కాస్త స‌హ‌నంతోనే సాగారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌ర్కారుపై ఎల్వీ ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. కోడ్ కార‌ణంగా సీఎంగా చంద్ర‌బాబుకు అధికారాలు ఉండ‌వ‌ని ఎల్వీ నిజంగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు... ఎల్వీకి లేఖ రాశారు. ఈ లేఖ‌కు త‌న‌దైన శైలిలో స్పందించిన ఎల్వీ... ఏక‌వాక్య వివ‌ర‌ణ ఇచ్చి మ‌రింత క‌ల‌క‌లం రేపారు.

ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల్లో త‌న‌కు దురుద్దేశాలు ఆపాదించ‌డాన్ని ఖండిస్తున్నాన‌ని ఎల్వీ ఆ ఆన్స‌ర్ లో చెప్పుకొచ్చారు. తాజాగా నిన్న ఉద‌యం చంద్ర‌బాబు స‌చివాల‌యానికి వెళితే... ఎల్వీ ఆయ‌న వ‌ద్ద‌కే వెళ్ల‌లేదు. వెర‌సి ఎల్వీ వైఖ‌రిని పూర్తిగానే అర్థం చేసుకున్న సీఎంఓ క‌త్తి దూసేందుకు రంగం సిద్ధం చేసింద‌ట‌. మొత్తంగా నిన్న‌టిదాకా ఎల్వీ చ‌క్రం తిప్పితే... ఇప్పుడు దానికి చంద్ర‌బాబు విరుగుడు మంత్రం వేసేందుకు ప‌క‌డ్బందీగానే ముందుకు సాగుతున్న‌ట్లుగా స‌మాచారం. సీఎంకే ఏక వాక్య స‌మాధానం ఇస్తారా? అంటూ ఇప్పుడు ఎల్వీకి సీఎంఓ నుంచి ఓ శ్రీ‌ముఖం వెళ్‌ల‌నుంద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English