జ‌న‌సేకు ముఖ్య‌నేత గుడ్‌బై

జ‌న‌సేకు ముఖ్య‌నేత గుడ్‌బై

సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న పార్టీ సీనియర్‌ నేత మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో  రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. అంత‌టి సీనియ‌ర్ రాజీనామా వెనుక ర‌క‌ర‌కాల కార‌ణాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

జ‌న‌సేన పార్టీలో కొనసాగుతున్న సీనియ‌ర్ల‌ను పట్టించుకోకుండా, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీనియర్‌ నేతలు  భావిస్తున్నార‌ని, తాజాగా రాఘ‌వ‌య్య సైతం అదే కారణంతో పార్టీకి గుడ్‌బై చెప్పార‌ని అంటున్నారు. టీడీపీతో జనసేన రహస్య సంబంధాలు నచ్చకే పార్టీని రాఘవయ్య వీడినట్టు కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న‌కు తోడుగా కీల‌క‌మైన కోశాధికారి స్థానంలో ఉన్న రాఘ‌వ‌య్య రాజీనామా చేయ‌డం పార్టీకి పెద్ద దెబ్బ అని చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నికల ఫలితాలు రాక ముందే నాయకుల వరుస రాజీనామాలు జనసేన పార్టీలో కలకలం రేపుతున్నాయి.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు టికెట్లు ఆశించి ఆ అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పేశారు. అయితే, తాజాగా ఫ‌లితాల కోసం నిరీక్ష‌ణ కొన‌సాగుతున్న త‌రుణంలో...రాఘ‌వ‌య్య రాంరాం చెప్ప‌డం జ‌న‌సేన‌కు ఊహించ‌ని షాక్ వంటిద‌ని ప‌లువ‌రు పేర్కొంటున్నారు. ఈ ప‌రిణామంపై జ‌న‌సేన నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English