కేరాఫ్ మలేసియా... వైసీపీ నేతల ఎంజాయ్‌మెంట్

కేరాఫ్ మలేసియా... వైసీపీ నేతల ఎంజాయ్‌మెంట్

ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి.. వైసీపీ కోసం చొక్కాలు చించుకున్న ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీ బాగానే చూసుకుందట. వారంతా గత కొన్ని నెలలుగా విరామమెరుగకుండా పనిచేసి అలసిపోయినందున కాస్త రిలాక్సయ్యందుకు పార్టీ నుంచి ఆర్థిక ఆసరా దొరికొందని చెబుతున్నారు. దీంతో పాస్ పోర్టులు ఉన్న నాయకులంతా వీలైతే కుటుంబాలతో.. లేదంటే స్నేహితులతో కలిసి విదేశా టూర్లకు చెక్కేశారట.

అసలే వేసవి కాలం కావడంతో చల్లని ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తున్నారట. కుటుంబసభ్యులందరికీ పాస్ పోర్టులున్న నేతలు విదేశాలకు కుటుంబాలతో సహా ఇప్పటికే వెళ్లారట.

వైసిపి నేతల్లో ఎక్కువమంది మలేషియాకే వెళ్ళారట. కుంటుంబాలతో కొందరు మిత్రులతో కొందరు ముందుగానే మలేషియాకు టికెట్లు రిజర్వు చేసుకోవటంతో ప్రయాణంలో ఇబ్బంది కలగలేదు. పార్టీ తరపున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్ధులే కాకుండా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా విదేశాలకు వెళ్ళినట్లు సమాచారం.

చంద్రబాబునాయుడు లాగ జగన్మోహన్ రెడ్డి పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు అడగటం లేదు.  నియోజకవర్గాల్లో గెలుపోటములపై వర్క్ షాపు కూడా నిర్వహించలేదు. తనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో అన్నీ నియోజకవర్గాలపై తానే సమాచారం తెప్పించుకున్నారు.  కాబట్టే అభ్యర్ధులకు, ద్వితీయ శ్రేణి నేతలకు కావలసినంత వెసులుబాటు దొరికింది. మొత్తానికైతే వైసీపీలో మంచి జోష్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English