ఔను...ఈసీపై సోమిరెడ్డి గెలిచారు...

ఔను...ఈసీపై సోమిరెడ్డి గెలిచారు...

ఏపీ వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. ఆయ‌న మొండి ప‌ట్టుద‌ల‌కు ద‌క్కిన ఫ‌లిత‌మ‌ని కూడా భావించ‌వ‌చ్చు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు.  అమ‌రావ‌తిలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ``నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖపై సమీక్ష చేస్తా..? ఎవరు అడ్డుకుంటారో చూస్తా?ఎవరైనా నా సమీక్షని అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తా`` అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అనంత‌రం, ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించ‌గా....అధికారులు హాజ‌రుకాలేదు. దీనికి ఈసీ ఆదేశాలు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. అయితే, తాజాగా ఆ ఈసీ నుంచి సోమిరెడ్డికి ఊర‌ట ద‌క్కింది.

మంత్రి సోమిరెడ్డికి ఎన్నికల కమిషన్ కోడ్ నుంచి మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో పంట నష్టం, కరవు తదితర ప్రకృతి వైపరీత్యాలపై సమీక్ష నిర్వహించుకునేందుకు తాజాగా ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే సోమిరెడ్డి సంబంధిత శాఖాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసీ అనుమితినిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ప్రత్యేక కమిషనర్లు కూడా హాజరు కానున్నారు. స్థూలంగా ఈసీపై సోమిరెడ్డి విజ‌యం సాధించార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English