క‌మ‌లం గెలుపు ప‌క్కానేన‌ట‌!... బెట్టింగ్ జోరందుకున్నాయి!

క‌మ‌లం గెలుపు ప‌క్కానేన‌ట‌!... బెట్టింగ్ జోరందుకున్నాయి!

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. గ‌తానికి భిన్నంగా ఏకంగా ఏడు విడ‌త‌ల పోలింగ్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీర్మానించ‌గా.. ఇప్ప‌టికే నాలుగు విడ‌త‌ల పోలింగ్ ముగిసిపోగా... ఇంకో మూడు విడ‌త‌లు మిగిలి ఉన్నాయి. స‌గానికి పైగా లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యంపై అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌లు ప్రారంభం కావ‌డానికి ముందే... క‌మ‌ల‌నాథుల‌కే ఎడ్జ్ ఉన్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగాయి. ఇప్పుడు స‌గానికి పైగా సీట్ల‌కు పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా ఎడ్జ్ బీజేపీ వైపే మొగ్గుతోంది. ఇంకేముంది... అప్పుడే బెట్టింగులు షురూ అయిపోయాయి. పొలిటిక‌ల్ బెట్టింగుల‌కు పెట్టింది పేరైన స‌త్తా బ‌జార్ లో ఇప్పుడు క‌మ‌లం జ‌య‌కేతనంపై జోరుగా బెట్టింగులు జ‌రుగుతున్నాయ‌ట‌. స‌త్తా బ‌జార్ బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఇదే ప‌నిగా పెట్టుకున్నార‌ట‌.

బెట్టింగుల్లో ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో పాటు గెలిచే అవ‌కాశాలున్న బీజేపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఓడే కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న అంశాల‌తో పాటు ఏఏ రాష్ట్రంలో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న అంశాల‌పైనా అక్క‌డ జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయట‌. ఈ చ‌ర్చ‌ల జోరును బ‌ట్టే... నానాటికీ బెట్టింగుల జోరు కూడా పెరిగిపోతోంద‌ట‌. ఇక స‌త్తా బ‌జార్ బెట్టింగురాయుళ్ల అంచ‌నాల్లో ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు వ‌స్త‌య‌న్న అంశానికొస్తే... మొత్తం 543 స్థానాలకు గాను 250 స్థానాల్లో కమలం పార్టీ వికసిస్తుందట‌. కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలకు పరిమితమవుతుందట‌. కాంగ్రెస్ కు ఈ లెక్క‌ 2014లో పొందిన సీట్ల కంటే చాలా అధికం అని బుకీలు చెబుతున్నారు.  ఇక మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి 300 పైచిలుకు స్థానాలు వస్తాయని బెట్టింగ్ బంగార్రాజులు చెబుతున్నారు. ఈ లెక్క‌న మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట‌.

ఇక ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల‌కు వ‌చ్చే సీట్ల లెక్క‌ను బెట్టింగ్ రాయుళ్లు లెక్క‌లేసి మ‌రీ చెబుతున్నారు. వీరి లెక్క ప్ర‌కారం.... ఉత్తర్‌ప్రదేశ్‌లో 41 సీట్లు బీజేపీ విజయం సాధిస్తుందద‌. మధ్యప్రదేశ్‌లో 20 నుంచి 22 స్థానాలు, గుజరాత్‌లో 22 నుంచి 24, బీహార్‌లో 12 నుంచి 14, పశ్చిమ బెంగాల్‌లో 8 నుంచి 11 సీట్లు, హర్యానాలో 7-9 స్థానాలు, ఢిల్లీలో 5 నుంచి 7 స్థానాల్లో క‌మ‌ల‌నాథులు విజయం సాధిస్తార‌ట‌. ఇక మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి 31 నుంచి 34 స్థానాల్లో విజయం సాధిస్తుందట‌. మొత్తంగా స‌ర్వేలు చేస్తున్న మీడియా సంస్థ‌ల‌కు ధీటుగా స‌త్తా బ‌జార్ బెట్టింగ్ బంగార్రాజులు ఈ ఎన్నిక‌ల లెక్క‌ల‌నేస్తున్నార‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English