పూజ హెగ్డే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ డీటెయిల్స్‌!

పూజ హెగ్డే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ డీటెయిల్స్‌!

మహర్షి చిత్రంపై అపారమైన నమ్మకంతో వున్న పూజా హెగ్డే ఆ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది. పార్టీ తర్వాత ఆమె తన మేనేజర్‌ కారులో వెళుతూ వుండగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో కారు నడుపుతోన్న మేనేజర్‌ పోలీసులకి చిక్కాడు. పరిస్థితి అర్థం చేసుకున్న పూజ మీడియా రాకముందే అక్కడ్నుంచి వేరే కారులో వెళ్లిపోయింది. కానీ మీడియాలో మాత్రం పూజనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో పట్టుబడిందనే రూమర్లు వ్యాపించాయి.

నిజంగా పూజనే డ్రైవింగ్‌ సీట్‌లో వుంటే మీడియా వెళ్లే లోగా ఆమెకి ఉపశమనం దక్కదుగా. పలువురు సెలబ్రిటీలు ఇలాంటి సిట్యువేషన్‌ని ఫేస్‌ చేయడమనేది తెలిసిందే. అందులోను టాప్‌ సెలబ్రిటీలు దొరికితే సదరు పోలీసులు కూడా అంత ఈజీగా సెన్సేషన్‌ని, అటెన్షన్‌ని మిస్‌ చేసుకోరు. కాబట్టి ఆమె మేనేజర్‌ దొరికాడు, పూజ అక్కడ్నుంచి వెళ్లిపోయిందనే వార్త వాస్తవబద్ధంగానే వుంది. ఏది ఏమైనా ఇలాంటి లేట్‌ నైట్‌ పార్టీలకి అటెండ్‌ అయ్యేప్పుడు వెనక్కి తీసుకెళ్లే డ్రైవర్‌ తాగకుండా వుండేలా జాగ్రత్త పడితే సెలబ్రిటీలకి ఈ తిప్పలు వుండవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English