'బఫున్' మాట‌కు భారీ పంచ్ ఇచ్చిన రేవంత్‌

'బఫున్' మాట‌కు భారీ పంచ్ ఇచ్చిన రేవంత్‌

అన్ని సంద‌ర్భాల్లో ఎదురుదాడి అస్స‌లు ప‌నికి కాదు. తెలివైనోడు అన‌వ‌స‌రంగా ఆవేశ ప‌డ‌ర‌న్న మాట‌ను చెబుతుంటారు. నిప్పులు చెరిగే ప్ర‌త్య‌ర్థులను మాట‌ల‌తో స‌మాధాన‌ప‌రిచే తీరుకు భిన్నంగా.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో కొత్త త‌ల‌నొప్పుల్ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెచ్చుకున్నారా? అన్న భావ‌న క‌లిగేలా తాజా ప‌రిణామం చోటుచేసుకుంది. ఇంట‌ర్ విద్యార్థుల విష‌యంలో తెలంగాణ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన కేటీఆర్.. ఆయ‌న్ను బ‌ఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్య చేయ‌టం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌పై వీహెచ్ ఇప్ప‌టికే స్పందించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వీహెచ్ లాంటి సీనియ‌ర్ నేత‌ను ప‌ట్టుకొని అంత మాట అంటావా? అని ప్ర‌శ్నించారు. ఒక కుర్ర‌కుంక సీనియ‌ర్ నేతను ప‌ట్టుకొని బ‌ఫున్ అంటున్నాడ‌న్న ఆయ‌న‌.. రాష్ట్రంలో కండ‌కావ‌ర పాల‌న సాగుతుందో ఈ వ్యాఖ్య‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌న్నారు.

విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న వీహెచ్ ను ఉద్దేశించి ఇంత దారుణ వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న ఆయ‌న‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి బ‌లుపు పాల‌న‌గా మండిప‌డ్డారు. వీరికి బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు. మార్కులు తారుమారు చేసి విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌న్నారు. ఎంసెట్ పేప‌ర్ లీక్ కుంభ‌కోణం బ‌య‌ట‌కొచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఇష్యూ తేల‌లేద‌న్న ఆయ‌న‌.. ఎంసెట్ ఇష్యూలో నిందితులుగా చెబుతున్న రావ‌త్.. క‌మ‌లేష్ లు అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందార‌న్నారు.

మాగ్న‌టిక్ ఇన్ఫోటెక్ సంస్థ మీద ఎందుకు కేసులు పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించిన రేవంత్.. కేసీఆర్ స్నేహితుడు మామకు చెందిన కంపెనీనే మాగ్న‌టిక్ ఇన్ఫోటెక్ అని ఆరోపించారు. 20 ఏళ్లుగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ‌ను త‌ప్పించి.. కేటీఆర్ స్నేహితులకు చెందిన ప్రైవేటు సంస్థ గ్లోబ‌రీనాకు టెండ‌ర్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

మాగ్న‌టిక్ ఇన్ఫోటెక్ రావు.. గ్లోబ‌రీనా రాజు వెనుక యువ‌రాజు లేడా? అని తాను అడుతున్న‌ట్లుగా రేవంత్ వ్యాఖ్యానించారు. 2017లో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆ శాఖ నుంచి ఒక ప్ర‌తినిధి గ్లోబ‌రీనాకు టెండ‌ర్ ఇచ్చార‌న్నారు. గ్లోబరీనాపై కేసులు పెడితే కేటీఆర్ బావ‌మ‌రిది.. ఇంకా అత‌ని స్నేహితులు లోప‌ల‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని.. అందుకే కేసులు పెట్ట‌టం లేద‌న్నారు. కేటీఆర్ నిజంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం అయితే కోర్టుకు వెళ్లాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మాగ్న‌టిక్ ఇన్ఫోటెక్.. గ్లోబ‌రీనాలో జ‌రిగిన అక్ర‌మాల్ని తాను నిరూపిస్తాన‌ని.. నూనూగు మీసాల విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే.. బాధిత కుటుంబాల్ని ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ప‌రామ‌ర్శించారా? అని ప్ర‌శ్నించారు. గ్లోబ‌రీనా మీద చ‌ర్య తీసుకోవాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీలు.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తే.. అడ్డుకుంది రాజు కేసీఆర్.. యువ‌రాజు కేటీఆర్ మాత్ర‌మేన‌న్నారు.

"కేసీఆర్ కు రాజ‌కీయ భిక్ష పెట్టిన హ‌నుమంత‌న్న అని.. అన్నం తినెప్పుడు వెళ్లి మీ అయ్య‌ను అడుగు కేటీఆర్.. హ‌నుమంత‌న్న క‌థేంద‌ని.. కేటీఆర్ గేటు ముందు ఉండే ఒక కుక్క మాట్లాడుతూ.. న‌న్ను రాజ‌కీయ ఉగ్ర‌వాది అంటున్నాడు. ఈ రాష్ట్రంలో అస‌లైన ఆర్థిక ఉగ్ర‌వాదులు.. టెర్ర‌రిస్టులు టీఆర్ఎస్ నేత‌లే" అంటూ నిప్పులు చెరిగారు. 23 మంది విద్యార్థులు ప్రాణాలు పోయిన త‌ల్లిదండ్రులు రోడ్డు మీద‌కు వ‌స్తే కాంగ్రెస్ వారికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్న రేవంత్‌.. మాగ్నాటిక్ ఇన్ఫోటెక్.. గ్లోబ‌రీనాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌న్నారు. ఒక‌వేళ అక్ర‌మాలు నిరూపించ‌కుంటే టీఆర్ఎస్ నేత‌లు వేసే శిక్ష‌కు తాను సిద్ధ‌మ‌న్న ఆయ‌న‌.. చ‌ర్చ అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద కానీ.. మీరు చెప్పే ఎక్క‌డికైనా తాను సిద్ధ‌మ‌న్నారు. ఈ స్థాయిలో మాట్లాడిన రేవంత్ కు కేటీఆర్ ఏమ‌ని రిప్లై ఇస్తారో చూడాలి.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English