షాకింగ్‌: పెచ్చులు ఊడిన చార్మినార్ మీనార్!

షాకింగ్‌:  పెచ్చులు ఊడిన చార్మినార్ మీనార్!

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం పేరు చెప్పినంత‌నే క‌ళ్ల ముందు క‌ద‌లాడే క‌ట్ట‌డం చార్మినార్. వంద‌ల ఏళ్ల నాటి ఈ క‌ట్ట‌డం హైద‌రాబాద్ కు ఒక ఐకాన్ అన్న విష‌యం తెలిసిందే. అంత‌టి ప్ర‌సిద్ధ క‌ట్టడంలోని ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడి కింద‌ప‌డిన వైనం క‌ల‌క‌లం రేపుతోంది.

నిన్న అర్థ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత‌.. చార్మినార్ మినార్ లోని ఒక దాని నుంచి పెచ్చు ఊడిపోవ‌టాన్ని అక్క‌డి స్థానికులు గుర్తించారు. రాత్రి వేళ కావ‌టం.. అక్క‌డ జ‌నం పెద్ద‌గా లేక‌పోవ‌టంతో పెనుప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. చార్మినార్ మినార్ పెచ్చులు ఊడుతున్న వైనాన్ని కొంద‌రు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో.. ఈ వీడియోలు వైర‌ల్ గా మారాయి.

మ‌రోవైపు.. చార్మినార్ ప‌రిర‌క్ష‌ణ కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ప్ప‌టికీ.. ఇలాంటి ప‌రిస్థితి చోటు చేసుకోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో పాటు.. వార‌స‌త్వ సంప‌ద విష‌యంలో ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోని రీతిలో వ్య‌వ‌హ‌రించ‌ట‌మే తాజా దుస్థితికి కార‌ణంగా చెబుతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి.. యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోకుంటే.. మ‌హాద్భుత క‌ట్టడాని ముప్పు వాటిల్ల‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి.

మినార్ పెచ్చు ఊడిపోయిన వైనంతో మేల్కొన్న అధికారులు వెంట‌నే.. అక్క‌డ ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను స‌మీక్షిస్తున్నారు. స్థానిక కార్పొరేట‌ర్.. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు.. ఇత‌ర అధికారులు చార్మినార్ వ‌ద్ద‌కు చేరుకొని.. అక్క‌డి ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English