హైద‌రాబాదీ ఉద్యోగిణుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్!

హైద‌రాబాదీ ఉద్యోగిణుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్!

మ‌హిళ‌ల‌పై ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న నేరాల నేప‌థ్యంలో.. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌న్నార్ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మ‌హిళా ఉద్యోగుల విష‌యంలో వ్యాపార సంస్థ‌లు.. కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని ఆయ‌న పేర్కొన్నారు. రాత్రి 8.30 గంట‌ల త‌ర్వాత ఉద్యోగ బాధ్య‌త‌లు ముగించుకొని వెళ్లే మ‌హిళా ఉద్యోగుల‌కు ఆయా కంపెనీలే ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ఆదేశించారు.

అంతేకాదు.. వారు ఏ స‌మ‌యంలో ఇంటికి బ‌య‌ల్దేరారు?  ఏ వాహ‌నంలో వెళుతున్నారు?  అన్న విష‌యాల్ని కూడా కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌చేయాల్సిన బాధ్య‌త కంపెనీల పైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కార్మికుల చ‌ట్టం సెక్ష‌న్ 3వీ కూడా ఇదే విష‌యాన్ని చెబుతుంద‌న్నారు.

ఒక‌వేళ మ‌హిళా ఉద్యోగిని ఎవ‌రైనా కంపెనీ ఏర్పాటు చేసే వాహ‌నంలో వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌కుంటే.. వేరే మార్గాల ద్వారా ఇంటికి వెళ్లాల‌నుకుంటే.. ఆ మేర‌కు స‌ద‌రు ఉద్యోగినితో రాత‌పూర్వ‌కంగా లేఖ రాయించుకోవాల‌ని కంపెనీల‌కు సూచ‌న చేశారు. ఉద్యోగిని పేర్కొన్న విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేయాలన్నారు. ఒక‌వేళ‌.. ఈ విధానాన్ని కంపెనీలు ఫాలో కాకుంటే.. ఉద్యోగిణుల‌కు ఏదైనా జ‌రిగితే.. దాని పూర్తి బాధ్య‌త కంపెనీల మీద‌నే ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఉద్యోగిణులు.. కంపెనీ యాజ‌మాన్యాల‌కు పోలీసుల స‌హ‌కారం అవ‌స‌ర‌మైతే.. డ‌య‌ల్ 100కు కానీ.. తాము ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబ‌ర్ ను సంప్ర‌దించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఒక వాట్సాప్ నెంబ‌రు ( 9490617444)ను విడుద‌ల చేశారు. ఒక్క సైబ‌రాబాద్ లోనే కాకుండా హైద‌రాబాద్ లోని మ‌హిళా ఉద్యోగులంద‌రికి ఈ విధానం వ‌ర్తించేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే మ‌రింత మేలు జ‌ర‌గ‌ట‌మే కాదు.. మ‌హిళల భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English