ఉత్త‌మ్ ప‌ద‌వి ఊడేందుకు తేదీ ఖ‌రారైంది

ఉత్త‌మ్ ప‌ద‌వి ఊడేందుకు తేదీ ఖ‌రారైంది

రాజ‌కీయాల్లో ఒక్కో అంశం గురించి క్రేజ్ ఉండ‌టం స‌హ‌జ‌మే కానీ...డెడ్‌లైన్ విధించి మ‌రీ ముఖ్యుల‌ను టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌ర‌మే కాకుండా వింత కూడా!. అలాంటి వింత‌కు తెలంగాణ కాంగ్రెస్ వేదిక అయింది!! కాంగ్రెస్‌లోని కొంద‌రు లీడ‌ర్లు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిని టార్గెట్ చేసేశారు.  అదికూడా ఆషామాషీగా కాకుండా...ఆయ‌న ప‌ద‌వి ఊడిపోయే తేదీల‌ను ఖ‌రారు చేస్తూ ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ వివిధ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డం, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌డం...కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం దిశ‌గా సాగుతుండ‌టం వంటివి ఉత్త‌మ్ సీటుకు ఎస‌రు పెడుతున్నాయనే చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.  తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నికల్లో కాంగ్రెస్  త‌ర‌ఫున కేవ‌లం 19 మందే గెలుపొందారు. అందులోనూ 11 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరనున్నారని, సీఎల్పీ విలీననమవుతుందని, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ కోల్పోనుందని  కూడా ప్రచారమవుతోంది.

దీనికంత‌టికీ...ఉత్తమ్ వైఫల్యమేన‌ని కొంద‌రు సీనియ‌ర్లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో అధ్యక్ష పదవి మార్పుపై మళ్లీ చర్చ ఊపందుకు న్నది. మే 30 లోపు అధిష్టానం ఈ ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ఉన్నట్టు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇంకేముంది, డెడ్‌లైన్ సైతం ఖరారు అవ‌డంతో....సీనియర్‌ నేతల్లో ఎవరో ఒకరు ఆ పదవిని దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాల్లో ఉన్నట్టు గాంధీభవన్‌ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల ఫలితాల త‌ర్వాత‌ జ‌ర‌గ‌బోయే ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా అవ‌కాశం కైవ‌సం చేసుకుందామ‌ని నేత‌లు తెగ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం పార్టీని నడిపించడంలో వైఫల్యం చెందిందని, తమకు అవకాశం ఇస్తే సత్తా చాటుతామని అధిష్టానం వ‌ద్ద ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English