ఆ సీఎంకు ల్యాప్ టాప్ వాడ‌టం రాద‌ట‌!

ఆ సీఎంకు ల్యాప్ టాప్ వాడ‌టం రాద‌ట‌!

ఎన్నిక‌ల వేళ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉద్దేశించి రాజ‌కీయ నేత‌లు ఎంత‌లా విరుచుకుప‌డతారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా ఇదే త‌ర‌హాలో త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ఆస‌క్తిక‌ర చుర‌క‌లు వేశారు స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ను ఉద్దేశించి ఆయ‌న ఎట‌కార‌పు వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగికి ల్యాప్ టాప్ వాడ‌టం రాద‌ని.. అందుకే.. రాష్ట్ర యువ‌త‌కు వాటిని ఇవ్వ‌టం మానేసిన‌ట్లుగా ఎద్దేవా చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో యువ‌త‌కు ల్యాప్ టాప్ లు ఇచ్చామ‌ని.. యోగికి ల్యాప్ టాప్ వాడ‌టం రాద‌ని.. అందుకే వారికి ల్యాప్ టాప్ ల‌ను ఇవ్వ‌టం లేద‌న్నారు. త‌మ పార్టీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి యోగి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని మండిప‌డ్డారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ నేత‌ల్ని ముఖ్య‌మంత్రి యోగి టార్గెట్ చేస్తున్నార‌ని.. కొంద‌రు వ్య‌క్తుల్ని ఇందుకు పావులుగా వాడుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌గ‌తి ప‌థంలోకి దూసుకెళితే.. యోగి హ‌యాంలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లుగా  పేర్కొన్నారు. ల‌క్నోలో మెట్రోను రికార్డు స‌మ‌యంలోనే పూర్తి చేసిన‌ట్లు పేర్కొన్న అఖిలేశ్‌.. ములాయం ఆగ్రా..ల‌క్నో ఎక్స్  ప్రెస్ హైవేను 24 నెల‌ల్లో పూర్తి చేయ‌మ‌ని కోరితే.. తాము కేవ‌లం 21 నెల‌ల్లోనే 302 కిలోమీట‌ర్ల రోడ్డును పూర్తి చేశామ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English