ఇండియన్ కాదన్నారు.. వేలితో సమాధానం చెప్పింది

ఇండియన్ కాదన్నారు.. వేలితో సమాధానం చెప్పింది

ఓవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి పెద్ద చర్చ నడుస్తున్న సమయంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే విషయంలో కూడా ఇలాంటి చర్చే మొదలైంది. దీపికకు భారత పౌరసత్వం లేదని, ఆమె డెన్మార్క్ పౌరురాలని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీపికకు మన దేశ పౌరసత్వం, ఓటు హక్కు రెండూ లేవని ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారానికి దీపిక తన వేలితో సమాధానం చెప్పింది. ఆమె ముంబయిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది. తాను ఈ దేశ పౌరురాలినే అంటూ ఓటు వేశాక సిరా చుక్క పెట్టిన వేలిని చూపిస్తూ స్పష్టం చేసింది దీపిక.

ఇంతకీ దీపికకు డెన్మార్క్ పౌరసత్వం ఉన్నట్లు ఎందుకు ప్రచారం జరిగింది అని సందేహం రావడం సహజం. నిజానికి ఆమె పుట్టింది ఆ దేశంలోనే. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే ఒకప్పటి అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడన్న సంగతి తెలిసిందే. కెరీర్ కోసం అప్పట్లో ఆయన డెన్మార్క్‌లోనే కొన్నేళ్లు ఉన్నాడు. అక్కడే శిక్షణ తీసుకుంటూ విదేశీ టోర్నీల్లో పాల్గొన్నాడు. తండ్రితో పాటే కొన్నేళ్లు దీపిక అక్కడుంది. దీంతో ఆమెకు డెన్మార్క్ పౌరసత్వం వచ్చిందని, ఇప్పటిదాకా ఆమె భారతీయ పౌరసత్వం పొందలేదని.. దీంతో ఆమె ఎన్నికల్లో ఓటు కూడా వేయడం లేదని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఐతే సోమవారం దీపిక ఓటు వేసి ఈ ప్రచారానికి తెరదించింది. ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ లాంటి సినిమాలతో నటిగా గొప్ప పేరు సంపాదించిన దీపిక.. ఇటీవలే తన ప్రియుడు రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English