రేవంత్ రెడ్డి చేతిలో కేటీఆర్ బుక్క‌యిన‌ట్లేనా?

రేవంత్ రెడ్డి చేతిలో కేటీఆర్ బుక్క‌యిన‌ట్లేనా?

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల ప్ర‌కంప‌నలు ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. అధికార పార్టీ ఎంత న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ విప‌క్షాలు మాత్రం త‌మ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్టడి నుంచి మొద‌లుకొని ఇంట‌ర్‌బోర్డ్ వ‌ద్ద నిర‌స‌న‌ల వ‌ర‌కు నిరంతం కొన‌సాగుతున్నాయి. అయితే, తాజాగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స‌హ‌జంగానే త‌మ ప్ర‌త్య‌ర్థి అయిన కేటీఆర్‌పై రేవంత్ విరుచుకుప‌డ్డారు. గ్లోబరీనా సంస్థకు టెండర్‌ ఇప్పించింది అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆరేనని ఆరోపించారు.

గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నిచేసే సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని ఓ ప్రైవేట్‌ సంస్థకు ఇంటర్‌ ఫలితాల బాధ్యతలు ఎలా అప్పగించడం వెనుక కేటీఆర్ ఉన్నార‌ని ఆరోపించారు. ఫలితాల ప్రకటన సీజీజీ నిర్వహించినన్ని రోజులూ ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన గుర్తు చేశారు. తాజాగా, పరీక్షల గందరగోళానికి కారణమైన గ్లోబెరినా.. ఎంసెట్ లీక్ కి సంబందించిన మాగ్నాటిక్ ఇన్ఫోటెక్ సంస్థ రెండూ ఒకటేనని పేర్కొన్నారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన గ్లోబరీనా సంస్థ, మ్యాగ్నటిక్‌ సంస్థలు.. ఈ రెండూ కలిసి కాకినాడ జేఎన్‌టీయూను మోసం చేశాయని ఆరోపించారు. నియమనిబంధనలు ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తుల వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని మండిప‌డ్డారు. ``మాగ్నటిక్ యజమాని విజయ్ రాం,అతని కొడుకు ప్రద్యుమ్న  కేటీఆర్ స్నేహితుడు కాదా?`` అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనాకు మళ్ళీ రీ వాల్యుయేషన్.. రీ వెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వ‌డం వెనుక మ‌ర్మ‌మేమిట‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. `గ్లోబరీనా సంస్థ తప్పిదాలు చేసింది అని ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ చెప్పినా.. ఎందుకు అదే కంపెనీకి ఇచ్చారు. క్రిమినల్ కేసులు పెట్టాల్సిన ప్రభుత్వం ..  మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు ఎందుకు ఇచ్చినట్టు..? పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను ఆన్ లైన్ లో పెట్టాలి. ఆ నిబంధన ఉన్నా.. ఎందుకు పాటించటం లేదు' అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇంటర్ బోర్డు సమస్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని విమర్శించారు. ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని లేనిప‌క్షంలో ఆందోళ‌న చేస్తామ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English