ప్రధాని మోడీ పరిధి దాటుతున్నారా...

ప్రధాని మోడీ పరిధి దాటుతున్నారా...

దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగోదశ ముగిసింది... మొదటి మూడు దశల  ఎన్నికలతో పోల్చితే నాలుగో దశ నుంచి చివరి ఏడవ దశ వరకు మెజార్టీ హిందీ బెల్ట్ లోనే ఎన్నికలు జరుగుతున్నాయి... నాలుగో, ఐదు, ఆరు, ఏడవ దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బిజెపి బలంగాఉన్న రాష్ట్రాలు అందులోనూ 2014 సమీకరణాల నేపథ్యంలో బిజెపి అధికారంలోకి రావడానికి మెజార్టీ ఎంపీలను బిజెపికి అందించిన ప్రాంతాలు కావడం విశేషం.. అందుకే కమలనాథులు గత పది రోజులుగా ప్రచారంలో స్పీడ్ పెంచారు... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల్లో ప్రచారంగా మలిచి ఎన్నికల్లో లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు... ఈ క్రమంలో ప్రధాని మోడీ పరిధి దాటుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది....

ఈ సారి ప్రచారంలో నేతలు నోటికి నరం లేకుండా పోయింది... ప్రజ్నా సాధ్వి నుంచి సమాజ్ వాదీ ఎంపీ ఆజంఖాన్ వరకు చేసిన వ్యాఖ్యలు శృతి మించాయి... జయప్రద లోదుస్తులకు సంబంధించి ఆ రంగువే వేసుకుంటుందంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజలకు మైండ్ బ్లాంక్ అయ్యింది... ఇక తన శాపం వల్లే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే తీవ్ర వాదుల దాడిలో మరణించారని ప్రజ్నా సాధ్వి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త సంచలనమయ్యాయి.. ఇలా దేశ వ్యాప్తంగా నేతలు తమ హోదా ను మరిచి ఇష్టం వచ్చినట్లు వాగుతూనే ఉన్నారు... కానీ ఈ పరిధి దాటి మాట్లాడిన జాబితాలో మోడీ కూడా చేరిపోయారా అంటే అవుననే అనుకోవాలి,, మోడీ కరడుగట్టిన బిజెపి నేత ఎవ్వరూ కాదనం గానీ ప్రధాని హోదాలో ఉండి ఆ స్థాయి తగ్గట్లుగా మాట్లాడటం లేదని విమర్శ ఈ సారి ఆయన ఎక్కువుగా ఎదుర్కొంటున్నారు..

ముఖ్యంగా రాజకీయాల్లో కుల ప్రస్తావన తగదనే గతంలో సెలవిచ్చిన ప్రధాని.. తాను బీసీనంటూ తన కులాన్ని ప్రస్తావించడాన్ని ఏమనుకోవాలి.... అలాగే బాలాకోట్ వీరులకు ఓటేస్తారో... పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఓటేస్తారో అంటూ చివరికి దేశ రక్షణలో అసువులు బాసిన ఆర్మీ జవాన్లును సైతం ఆయన ప్రచారంలో వాడుకున్నారు.. అంతటితో ఆగకుండా పరిధిని దాటి... మరీ.. 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... మీ ప్రభుత్వం కూలిపోతుందనే అర్థం వచ్చేలా బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి  ఆయన చేసిన వ్యాఖ్యలు... ఇప్పుడు దేశ వ్యాప్త సంచలనమయ్యాయి... అంటే ప్రధాని కూడా బేరసారాలాడుతున్నారా అన్న ప్రశ్న విపక్షాల నుంచి మొదలైంది... ప్రధాని స్థాయిలో ఉండి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఏమనుకోవాలనే ప్రశ్న బలంగా బయలుదేరింది.. ఇది ఖచ్చితంగా బేరసారాలకు దిగడమేనని ఈసీకి ఫిర్యాదు చేయడానికి విపక్షాలు సిద్దమవుతున్నాయి... అలాగే మరో బీజెపి నేత, యూపీ సీఎం అలీ కావాలా భజరంగ భళి కావాలాంటూ చేసిన వ్యాఖ్యతో ఈసీ ఆయన ప్రచారంలో మూడు రోజుల నిషేధం విధించింది.. ఒకటి మాత్రం నిజంగా మనం ఏం మాట్లాడిన మన స్థాయి మరిచి మాట్లాడుతున్నామే లేదో చూసుకోవాలి... ప్రధాని స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చర్చ కాకుండా ఎలా ఉంటుంది...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English