హెచ్‌1బీలో ఇంకో షాక్‌...కంపెనీ మారితే ఔట్‌

హెచ్‌1బీలో ఇంకో షాక్‌...కంపెనీ మారితే ఔట్‌

ఆంక్ష‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌....వీసా నిబంధ‌న‌ల‌పై క‌త్తివేటు వేయ‌డంలో సుప‌రిచిత‌మైన అమెరికా త‌న క‌త్తికి మ‌రింత ప‌దును పెడుతోంది. వీసా జారీల్లో కఠినంగా ఉంటున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సార‌థ్యంలోని సర్కార్ .. మరో అస్త్రాన్ని సంధించింది. హెచ్ 1బీ వీసా మీద ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు వేరే కంపెనీకి మారకుండా చేస్తోంది. ఆ కొత్త ఉద్యోగం పాతదానిలాగే ఉన్నా అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్ ) నో అంటోంది. ఆ ఉద్యోగి కి సంబంధిం చి వీసా ట్రాన్స్ఫర్ కు కంపెనీలు దరఖాస్తు చేసుకుంటున్నా తిరస్కరిస్తోంది. దానికి చూపుతున్న కారణం.. అదేమీ ‘స్పెషాలిటీ ఆక్యుపే షన్ (ప్రత్యేకనైపుణ్యాలు)’ కాదని చెబుతోంది.

 హెచ్ 1బీ వీసా మీద ఓ కంపెనీల పనిచేస్తున్న ఉద్యోగులు మరో కంపెనీకి మారకుండా మోకాలడ్డుతోంది. కొత్త కంపెనీలు ఉద్యోగికి సంబంధించి వీసా ట్రాన్స్ ఫర్ దరఖాస్తులను పెట్టు కుంటున్నా అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్ ) తిరస్కరిస్తోంది. అదేమీ ‘స్పెషాలిటీ ఆక్యు పేషన్ ’ కాదన్న సాకు చూపుతోంది. అంతేకాదు వీసా తిరస్కరించి ‘ఔట్ ఆఫ్ స్టేటస్ ’ స్టాం పేసి మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా మళ్లీ అమెరికాలో కాలుపెట్టకుండా నిషేధం విధిస్తోంది. భారత్ కు చెందిన ఉషా సాగర్ వాలా అనే మహిళకు అదే పరిస్థితి ఎదురైంది. దీనిపై ఆమె అమెరికా ఫెడరల్ కోర్టుకు వెళ్లినా మొండిచెయ్యే ఎదురైంది. జోక్యం చేసుకోలేమంటూ ఏప్రిల్ 16న కేసు కొట్టేసింది.

భారత మహిళ అయిన ఉషా సాగర్ వాలా అమెరికాలో 2012 నుంచి హెచ్ 1బీ వీసా మీద నివసిస్తోంది. 2018లో వేరే కంపెనీలోకి జాబ్ మారింది. అయితే, కంపెనీ పెట్టిన వీసా ట్రాన్స్ఫర్ దరఖాస్తును అదేమీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదంటూ యూఎస్ సీఐఎస్ తిరస్కరించింది. అంతేకాదు.. ఆమె వీసాను ఔట్ ఆఫ్ స్టేటస్ గా పేర్కొం ది. దీనిపై ఆమె అమెరికా ఫెడరల్ కోర్టుకెళ్లింది. హెచ్ 1బీ స్టేటస్ ను యథావిధిగా ఉంచాలని కోరింది. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఏప్రిల్‌‌ 16న కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థికంగా ఎలా హాని కలుగుతుందో సరైన ఆధారాలివ్వలేదని పేర్కొంటూ కేసును కొట్టేసింది.ఇండియాకు తిరిగి వెళితే ఏమవుతుందో చెప్పిందే తప్పదానికి సరైన వివరణంటూ ఏమీ ఇవ్వలేదని పేర్కొంది. ‘‘నెలవారీ లోన్లు, ఇతర ఖర్చులు 3711 డాలర్ల (సుమారు ₹2.6 లక్షలు) చెల్లింపునకు జీతమే ఆధారమని సాగర్‌‌‌‌వాలా చెప్పినా .. ఎంతవరకు ఆమె ఆధారపడుతోందో మాత్రం చెప్పలేదు. ఆమె మొత్తం ఆదాయం, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వెల్లడించలేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English