జ‌గ‌న్‌ను నెటిజ‌న్లు ఎందుకు ఆడుకున్నారంటే...

జ‌గ‌న్‌ను నెటిజ‌న్లు ఎందుకు ఆడుకున్నారంటే...

వివాదాస్పద‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వర్మ `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాతో క‌ల‌క‌లం సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ సినిమా విడుద‌ల‌కు ప్ర‌య‌త్నించ‌గా.... అనేకానేక ట్విస్టుల త‌ర్వాత‌ ఎట్టకేలకు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సినిమా కార్యక్రమాలకు సంబంధించి వర్మ ఏపీకి వస్తుండగా ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే.

ఈ విషయంపై వైఎస్ జగన్ స్పందిస్తూ..  `విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..!చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?" అంటూ ట్వీట్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, ఈ ట్వీట్ కార‌ణంగానే...జ‌గ‌న్‌ను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం అధికార‌ల‌న్నీ ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌లు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తుంటే...దానిపై వైసీపీ అభ్యంత‌రం తెల‌ప‌డం, ఈసీకి ఫిర్యాదులు చేయ‌డం వంటివ‌న్నీ మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. ఇవ‌న్నీ త‌మ పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలోనే జ‌రిగితే..తాజాగా జ‌గ‌న్ మాత్రం....రాంగోపాల్‌వ‌ర్మ అరెస్టు విష‌యంలో మాత్రం చంద్ర‌బాబును లాగుతూ ట్వీట్ చేయ‌డంపై ప‌లువురు నెటిజ‌న్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

"హహ.. మన ఆంధ్రప్రదేశ్ గత ప్రతిపక్ష నేత మరియు కాబోయే సీఎంగా కలలు కంటున్న జగన్ కి ప్రస్తుతం లా ఆండ్ ఆర్డ‌ర్‌ మరియు పరిపాలన మొత్తం ఎన్నికల కమిషనర్ మరియు చీఫ్ సెక్రటరీ చేతులో వుంది అని కనీస అవగాహన లేకపోవడం మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం " అంటూ ఓ నెటిజ‌న్ ఘాటుగా స్పందించారు.

మ‌రో నెటిజ‌న్ సైతం ఇదే రీతిలో రియాక్ట‌య్యారు. "ఆయ‌న నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా అతను ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. అందుకు అతనికి అనుమ‌తి ఇవ్వ‌క‌పో అరెస్ట్ చేశారు. అది ముందు తెలుసుకోండి మీరు. ఎప్పుడు కూడా పోలీసులపై నమ్మకం లేదు ,అని ప్రతిసారి వారిని తిడుతున్నారు కదా. పోలీస్ లేకపోతే ఒక ఇంచ్ కూడా కదల్లేరు మీ పొలిటీషన్స్ గుర్తుపెట్టుకోండి." అంటూ తెలిపారు. " ఓసోసి ..పప్పు...ప్రజాస్వామ్యము ఎవరి చేతిలో ఉంది నాయనా... సీఎం సమీక్షలు చేస్తేనే ఓహ్ గగ్గోలు పెట్టె నువ్వు...అధికారం ఎవరి చేతిలో ఉందొ తెలియదా..ఈసీ పరిధిలో పోలీసులు పనిచేస్తుంది అని తెలియని నివ్వు మాకు ప్రతిపక్ష నేత గా ఉండటం మా దురదృష్టం సర్" అంటూ విమ‌ర్శించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English