కేసీఆర్‌కు.. త‌న స‌త్తా చూపిన హ‌రీశ్!

కేసీఆర్‌కు.. త‌న స‌త్తా చూపిన హ‌రీశ్!

త‌న ప్రాధాన్య‌త‌ను ఎంత త‌గ్గిస్తున్నా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. తానేమిటో చేత‌ల్లో చేసి చూపిస్తున్నారు హ‌రీశ్ రావు. టీఆర్ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత ఎవ‌ర‌న్న విష‌యం మీద మ‌స్తు క్లారిటీ వ‌చ్చేయ‌ట‌మే కాదు.. హ‌రీశ్ ఇమేజ్ ను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో త‌గ్గిస్తున్న వేళ‌.. ఆయ‌న్ను అభిమానించే వారు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో.. అధినేత మీద అసంతృప్తి త‌మ నేత ఇమేజ్ కు డ్యామేజ్ కాకూడ‌ద‌న్న‌ట్లుగా కామ్ గా ఉంటూ.. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని ఒక కంట క‌నిపెడుతున్నారు హ‌రీశ్ ప‌రివారం.

ఇదిలా ఉంటే.. త‌న ప్రాధాన్య‌త‌ను త‌గ్గించాల‌ని చూస్తున్న తీరుకు ఒక ప‌ట్టాన లొంగ‌క‌.. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా త‌న స‌త్తా ఏమిటో చాటి చెబుతున్న హ‌రీశ్‌.. తాజాగా మ‌రోసారి తానేమిటో చేత‌ల్లో చూపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌గ్రామ‌మైన చింత‌మ‌డ‌క‌లో స్థానిక ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయ‌టం ద్వారా ఆయ‌న త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించారు.

సీఎం సొంత గ్రామంలో ఎన్నిక‌లు జ‌రగ‌ట‌మా? అన్న ప్ర‌శ్న తెర మీద‌కు రాకుండా.. తెర వెనుక మంత్రాంగాన్ని న‌డ‌ప‌టం ద్వారా.. బ‌రిలో నిలిచిన వారు త‌మ‌కు తాముగా త‌ప్పుకునేలా చేసిన హ‌రీశ్‌.. తానేమిటో చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.

స‌హ‌జంగా ఇలాంటి విష‌యాలు ర‌చ్చ‌గా మారుతుంటాయి. కానీ.. సీన్లో హ‌రీశ్ ఉంటే అలాంటి అవ‌కాశ‌మే ఉండ‌దు. ఈ విష‌యాన్ని హ‌రీశ్ త‌న ప‌ని తీరుతో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. సిద్ధిపేట గ్రామీణ మండ‌లం చింత‌మ‌డ‌క ఎంపీటీసీ స్థానాన్ని అన్ రిజ‌ర్వ‌డ్ మ‌హిళ‌కు కేటాయించారు. ఈ ఎన్నిక‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థితో పాటు.. కాంగ్రెస్.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు.

సీఎం సొంతూరులో ఎన్నిక‌ల జ‌ర‌గ‌ట‌మా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. అలాంటిదేమీ లేకుండా.. అధికార పార్టీ అభ్య‌ర్థి త‌ప్పించి.. మిగిలిన వారు ఎవ‌రికి వారుగా త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌టంతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం ఏక‌గ్రీవ‌మైంది. టీఆర్ఎస్ కు చెందిన రాందేని జ్యోతి ఎంపీటీసీగా ఎన్నిక‌య్యారు. అభ్య‌ర్థులు బ‌రిలో నుంచి త‌ప్పుకోవ‌టానికి హ‌రీశ్ న‌డిపిన మంత్రాంగ‌మేన‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా? హ‌రీశ్ అంటే అలానే ఉంటాది మ‌రి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English