ఈ సీఎం మీడియానే బ‌హిష్క‌రించేశారు!

ఈ సీఎం మీడియానే బ‌హిష్క‌రించేశారు!

క‌న్న‌డ నాట రాజ‌కీయం చాలా ప్ర‌త్యేక‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అక్క‌డ ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా కూడా దేశం మొత్తం ఆ వైపుగా దృష్టి సారిస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కింగుల‌వుతామనుకున్న క‌మ‌ల‌నాథులు కింద కూర్చుంటే... కింగ్ మేక‌ర్ అవుతాన‌నుకున్న జేడీఎస్ నేత కుమార‌స్వామి ఏకంగా కింగే అయిపోయారు. ఇక అప్ప‌టి నుంచి కుమార‌ను దించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కుట్ర‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సీఎం కుర్చీలో కుమార ప్ర‌శాంతంగా కూర్చునే అవ‌కాశ‌మే లేదు. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లంటూ ఇప్పుడు జ‌రిగిన పోట్లాట‌లోనూ మిత్ర‌ప‌క్షం కాంగ్రెస్ నుంచి కూడా కుమారకు ఇబ్బందులు త‌ప్ప‌లేదు.

సరే... రాజ‌కీయ‌మ‌న్నాక ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వు. అయితే ఈ ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుమార‌.. ఇప్పుడు ఆ క‌సినంతా తీసి మీడియాపై ప‌డేస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా వార్త‌లు రాయ‌లేందంటూ ఇప్ప‌టికే మీడియాపై ఒంటికాలిపై లేచిన కుమార‌... ఇప్పుడు ఏకంగా మీడియానే బ‌హిష్క‌రించేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇద్ద‌రు అభ్యర్థుల ఖ‌రారు కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ అయిన కుమార‌... తాను అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌లేదో, ఏమో తెలియ‌దు గానీ.. స‌మావేశం నుంచి చిర్రుబుర్రులాడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఎంత చిర్రుబుర్రులాడుతున్నా.... ఆయ‌న సీఎం క‌దా... క‌నిపిస్తే మీడియా మైకులు పెట్టేయ‌డం మామూలే క‌దా. అయితే మీడియా మైకుల‌ను చూడగానే కుమార ఒక్క‌సారిగా ఊగిపోయారు. తాను మీడియాను బ‌హిష్క‌రిస్తున్నాన‌ని, ఇక‌పై త‌న వ‌ద్ద‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పేశారు. ఈ విష‌యంపై మీ ఇష్ట‌మొచ్చిన క‌థ‌నాలు రాసుకున్నా త‌న‌కేమీ ఇబ్బంది లేద‌ని చెబుతూనే... తాను ఇక‌పై మీడియాతో మాట్లాడ‌నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English