కేటీఆర్ ఫ‌న్నీ రిప్లై!... లోకేశ్ ఏం చేశారండీ?

కేటీఆర్ ఫ‌న్నీ రిప్లై!... లోకేశ్ ఏం చేశారండీ?

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఏ విష‌యంపై అయినా ఎలాగైనా స్పందించ‌గ‌లిగే నేర్పు ఉన్న నేత‌. ప్ర‌త్య‌ర్థుల‌పై సెటైర్లు వేయ‌డ‌మే కాకుండా... అన‌వ‌స‌ర విష‌యాల్లో వారిని లాగితే మాత్రం అస్స‌లు స‌హించ‌రు. మొత్తంగా రాజ‌కీయాల్లో త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయాల వ‌ర‌కు మాత్ర‌మే శ‌త్రువులుగా ప‌రిగ‌ణించే కేటీఆర్‌... వ్య‌క్తిగ‌త విష‌యాల్లో మాత్ర వారిని త‌న మిత్రులుగానే ప‌రిగ‌ణిస్తారు. ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై ఓ రేంజిలో విరుచుకుప‌డే కేటీఆర్‌... మిగ‌తా స‌మయాల్లో మాత్రం చాలా కూల్ కూల్ గా క‌నిపిస్తారు.

ఇలాంటి ఓ అరుదైన ఘ‌ట‌నే ఒక‌టి ఆస‌క్తి రేకెత్తిస్తోంది. *ఆస్క్ కేటీఆర్‌* పేరిట ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌నంతో మాట్లాడేందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆదివారం కేటీఆర్ నోట నుంచి ఓ ఆస‌క్తిక‌ర మాట వినిపించింది. త‌న‌ను ప్ర‌శ్నించిన ఓ నెటిజ‌న్... టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ను లాగేశారు. దీంతో చాలా ఫ‌న్నీగానే స్పందించిన కేటీఆర్‌... మ‌ధ్య‌లో లోకేశ్ ఏం చేశారండీ బాబూ అంటూ త‌న‌దైన శైలి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్‌, కేటీఆర్ మ‌ధ్య ఎలాంటి సంబాష‌ణ చోటుచేసుకుంద‌న్న విష‌యానికి వ‌స్తే... త‌న ట్వీట్ల‌కు కేటీఆర్ ఎంత‌మాత్రం రిప్లై ఇవ్వ‌డం లేద‌ని నేరుగా కేటీఆర్ కే కంప్లైంట్ చేసిన ఓ నెటిజ‌న్‌...*కేటీఆర్.. నేను మీకు 100 ట్వీట్లు చేశా. కానీ మీరు ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. ఈసారి జవాబు ఇవ్వకుంటే నారా లోకేశ్ మీద ఒట్టే* అని హెచ్చరించాడు. దీంతో చాలా వేగంగా స్పందించిన కేటీఆర్‌... మ‌ధ్య‌లో లోకేశ్  ఏం చేశార‌బ్బా అంటూ త‌న‌దైన శైలి వ్యాఖ్య చేశారు. *మధ్యలో ఆయన ఏం చేశాడు బ్రదర్* అంటూ స‌ద‌రు నెటిజ‌న్ ను ప్ర‌శ్నించిన కేటీఆర్‌... త‌న‌ను ప్ర‌శ్న‌లు అడ‌గ‌మంటే ఇత‌రుల ప్ర‌స్తావ‌న ఎందుకంటూ ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English