వెన‌క‌డుగుపై ప్రియాంక రీజ‌నింగ్ భ‌లేగుందే!

వెన‌క‌డుగుపై ప్రియాంక రీజ‌నింగ్ భ‌లేగుందే!

ప్రియాంకా గాందీ వాద్రా.... ఈ దఫా ప్ర‌త్య‌క్ష ఎన్నికల్లోకి దిగి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు కొత్త జ‌వ‌స‌త్వాలు తీసుకొస్తార‌ని, 56 అంగుళాల ఛాతీ అంటూ త‌న‌కు తిరుగులేద‌న్న రీతిలో సాగుతున్న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై వార‌ణాసిలోనే ఆమె బ‌రిలోకి దిగి క‌మ‌ల‌నాథుల‌కు గ‌ట్టి షాకిస్తార‌ని ఆశించిన వారంతా ఇప్పుడు ఊసురోమన త‌ప్ప‌లేదు. ఊరించి ఊసురుమ‌నింపించిన ప్రియాంకా గాంధీ వ్య‌వ‌హారంలో... ఆమెపై పెద్ద‌గా డౌట్లేమీ లేవు గానీ... అస‌లు డౌటంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ఆ పార్టీ అధినేత‌, ప్రియాంక సోద‌రుడు రాహుల్ గాంధీపైనే ఉన్నాయ‌ని చెప్పాలి.

రీజ‌న్సు ఏమిట‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మేన‌నుకున్నా... వార‌ణాసిలో తానెందుకు పోటీ చేయ‌డం లేద‌న్న అంశంపై ప్రియాంక ఆసక్తిక‌ర వాదన‌ను వినిపించారు. ఆమె చెప్పిన కార‌ణాలు వింటే... రీజ‌నింగ్ లో ప్రియాంక పీహెచ్ డీ చేసే ఉంటార‌న్న వాద‌న వినిస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా ప్రియాంక ఈ రీజ‌నింగ్ వినిపించారు. అయినా ప్రియాంక చెప్పిన రీజ‌న్స్ ఏంటంటే... వారణాసి నుంచి ప్రియాంక‌ పోటీ చేయరాదన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకత్వమే తీసుకుందట‌.

అందరూ కలిసి చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారట‌. ప్రియాంక‌పై చాలా పెద్ద బాధ్యతలను పార్టీ ఉంచిందట‌. ఎంతో మంది తరఫున ఆమె ప్రచారం చేయాలని కోరుకుంటున్నారట‌. ఈ దశలో ఆమె పోటీ చేస్తే, వారంతా నిరాశకు గురవుతారట‌. అందుకే ఆమె పోటీ చేయడం లేద‌ట‌. ఆమెకు గానీ, ఆమె సోదరుడు రాహుల్ కు గానీ పదవులపై ఆశ లేదట‌. మొత్తంగా ప్రియాంక నోట వినిపించిన ఈ రీజ‌నింగ్ చూస్తుంటే... ఏమ‌నిపిస్తోంది. రీజ‌నింగ్ లో ఆమె పెద్ద పెద్ద డిగ్రీలే చేసిన‌ట్టు అనిపించ‌డం లేదూ. అదీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English