రాముల‌మ్మ స్ట్రైట్ క్వ‌శ్చ‌న్‌!... జ‌గ‌న్ ఆన్స‌రివ్వ‌లేరంతే!

రాముల‌మ్మ స్ట్రైట్ క్వ‌శ్చ‌న్‌!... జ‌గ‌న్ ఆన్స‌రివ్వ‌లేరంతే!

తెలుగు నేల‌లో ఎన్నిక‌ల కోలాహ‌లం ముగిసినా... ఇంకా ఫ‌లితాల‌కు 20 రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉండ‌టంతో ఎన్నిక‌ల వేడి కంటిన్యూ అవుతున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌ర‌గ‌గా, ఏపీలో లోక్ స‌భ‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో నేత‌లు గెలుపు మాదంటే... కాదు మాదంటూ ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ‌లోనూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఇంకా అక్క‌డ ఎన్నిక‌ల కోలాహ‌లం ముగియ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో టీ కాంగ్రెస్ నేత‌, ఫైర్ బ్రాండ్ గా పేప‌రొందిన విజ‌య‌శాంతి ఫేస్ బుక్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ అంశం ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఏపీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాముల‌మ్మ స‌ద‌రు అంశాన్ని పోస్ట్ చేశారు. అందులో జ‌గ‌న్ ను సూటిగా ప్ర‌శ్నించిన రాముల‌మ్మ‌... స‌మాధానం ఏం చెబుతారంటూ జ‌గ‌న్ ను ఏకంగా నిల‌దీసినంత ప‌నిచేశారు. అయినా రాముల‌మ్మ సంధించిన ప్ర‌శ్న ఏమిటంటే... పార్టీ ఫిరాయింపుల మీదే. ఏపీలో టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు నిర‌స‌న‌గా అసెంబ్లీ స‌మావేశాల‌నే బ‌హిష్క‌రించిన జ‌గ‌న్‌... తెలంగాణ‌లో అదే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ప్రోత్స‌హించిన టీఆర్ఎస్ తో ఎలా క‌లుస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

రాముల‌మ్మ ఫేస్ బుక్ పోస్ట్ ఇలా సాగింది. *వైసీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. మరి, తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? ఏపీలో తప్పయిన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలి* అంటూ జ‌గ‌న్ ను రాములమ్మ సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ గా క్వ‌శ్చ‌న్ చేసింది. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పడం జ‌గ‌న్‌కు అసాధ్య‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తామంటూ స్వ‌యంగా ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద రాములమ్మ సంధించిన ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెబుతారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English