ఢిల్లీ నుంచి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తార‌ట‌

ఢిల్లీ నుంచి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తార‌ట‌

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు సంచ‌ల‌నం స్ప‌ష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి బ్ర‌హ్మండ‌మైన మెజార్టీ వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచే...ఆ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్సహిస్తోంది. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, టీడీపీల నుంచి ఇప్ప‌టికే ఎమ్మెల్యేల‌ను గులాబీ గూటికి లాగేసింది. కాంగ్రెస్ నుంచి 11 మంది, టీడీపీ నుంచి 1 ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో విప‌క్షాల్లో క‌ల‌వ‌రం మొదలైంది. ఇప్పటికే గవర్నర్ నరసింహన్‌ను, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఇపుడు జాతీయస్థాయిలో దీనిపై కంప్లైంట్ చేయాలని డిసైడయ్యారు. త్వరలోనే నాయకుల బృందం ఢిల్లీకి వెళ్లనుందని స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది ఎమ్మెల్యేలు హ‌స్తం పార్టీకి గుడ్‌బై చెప్పేసి టీఆర్ఎస్ గూటికి చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీరంతా అవ‌స‌ర‌మైతే త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో ఇద్ద‌రు పార్టీ ఫిరాయించేస్తే....కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం ఖాయ‌మంటున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌మ ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తూ స్పీక‌ర్‌, గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన హ‌స్తం పార్టీ...త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను మ‌రింత ప‌టిష్టంగా ఉండేలా చూసుకుంటోంది. ఇందులో భాగంగానే...జాతీయ స్థాయిలో పిర్యాదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

అయితే, తాము ఒక్క‌ర‌మే పోరాటం చేయ‌డం కాకుండా కాంగ్రెస్ పార్టీ త‌మతో పాటు టీడీపీ, టీజేఎస్‌, సీపీఐల‌ను క‌లుపుకొంది. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలవాలని నిర్ణయించింది. మొత్తం 15 మంది సభ్యుల బృందం రామ్ నాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించామని.. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ అధికారులకు లెటర్ రాశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయాలని.. ఫిరాయింపులు జరగకుండా చూడాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని రాష్ట్రపతిని కోరనున్నారని స‌మాచారం. అయితే, దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు...అఖిల‌ప‌క్ష పార్టీ నేత‌ల ప్ర‌య‌త్నం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English