ఉత్త‌మ్ సీటు ఊడ‌టం ఖాయ‌మేనా?

ఉత్త‌మ్ సీటు ఊడ‌టం ఖాయ‌మేనా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ సీనియ‌ర్లు టార్గెట్ చేశారా? ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ వివిధ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డం, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌డం...కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం దిశ‌గా సాగుతుండ‌టం వంటివి ఉత్త‌మ్ సీటుకు ఎస‌రు పెడుతున్నాయా?  ఇన్నాళ్లు అంత‌ర్గ‌తంగా సాగిన కుంప‌ట్లు ఏకంగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు వెళ్ల‌డం దీనికి నిద‌ర్శ‌న‌మా? ప‌్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పీటీఐతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలపై మండిపడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం, ఇటీవల పార్టీ నేతలు పెద్దఎత్తున గుడ్‌బై చెప్పడం వంటి అంశాల‌పై మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ ప‌రిస్థితికి ఉత్తమ్ నాయకత్వలోపమే కారణమని మండిపడ్డారు. ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి నాయ‌క‌త్వంలో విఫలం చెందారని, ఆయనను పదవినుంచి తొలిగించాలని డిమాండ్‌చేశారు. ``అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీచేస్తే 19 మందే గెలుపొందారు. అందులోనూ 11 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. టీఆర్ఎస్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరనున్నారని, సీఎల్పీ విలీననమవుతుందని కూడా ప్రచారమవుతోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ కోల్పోనుంది. ఇది ఉత్తమ్ వైఫల్యమే`` అని శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో, పార్టీ నేతల్లో విశ్వాసం నింపలేకపోయిన ఉత్తమ్‌ను పదవినుంచి తొలిగించాలని ఆయన డిమాండ్‌చేశారు.  ప్రజల్లో, పార్టీ నేతల్లో విశ్వాసం నింపలేకపోయిన ఉత్తమ్ ఏనాడో దిగిపోవాల్సిందని అన్నారు. తనకు అవకాశం ఇస్తే, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ లోని ప‌రిణామాలు ఇటీవ‌లి కాలంలో పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తుండ‌గా...పీసీసీ చీఫ్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌నే డిమాండ్ బ‌హిరంగంగానే తెర‌మీద‌కు రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న‌కు ఆ పదవి ఇస్తే స్వీకరిస్తానని శ‌శిధ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే...కాంగ్రెస్‌లోని అసంతృప్తుల స‌మూహం బ‌ల‌ప‌డింద‌నే చెప్పుకోవాల‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English