19న ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్‌!... ఇంకో విష‌యం కూడాన‌ట‌!

19న ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్‌!... ఇంకో విష‌యం కూడాన‌ట‌!

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు విన‌గానే... బెజ‌వాడ మాజీ ఎంపీగా కంటే కూడా ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఫ‌లితాల‌కు ముందే ప‌క్కా లెక్క చెప్పేసే ఆంధ్రా ఆక్టోప‌స్ పేరే గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆ పేరు కాస్తా మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సందర్భంగా భారీగానే డ్యామేజీ అయ్యింది. టీఆర్ఎస్ ఓట‌మి కోసం ప‌క్కాగానే ప్లాన్ సిద్ధం కాగా... అందులో భాగంగా పోలింగ్‌కు ముందు టీఆర్ఎస్ ఓడిపోతుంద‌ని, టీడీపీ-కాంగ్రెస్ కూట‌మి బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని న‌మోదు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పేశారు. అది కూడా ఏకంగా మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చెప్పారు. అయితే ఆ అంచ‌నా అడ్డంగా ఫ్లాఫ్ అయిపోయింది. వెర‌సి ఆంధ్రా ఆక్టోప‌స్ బ్రాండ్ నేమ్ కు బ్యాడ్ నేమ్ వ‌చ్చేసింది.

ఈ క్ర‌మంలో చాలా రోజుల పాటు మీడియాకు క‌న‌బ‌డ‌కుండానే తిరిగిన రాజ‌గోపాల్‌... ఇటీవ‌ల తిరుమ‌ల వెళ్లిన సంద‌ర్భంగా క‌నిపించారు. తెలంగాణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన పొర‌పాటును ఈ సారి చేయ‌బోన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చివ‌రి ద‌శ పోలింగ్ ముగిసిన త‌ర్వాత వ‌చ్చే నెల 19న త‌న ఎగ్జిట్ పోల్స్ వెలువ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు. తాజాగా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంద‌ర్భంగా అక్క‌డి తెలుగు వారు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా ఇదే మాట‌ను ఆయ‌న వ‌ల్లె వేశారు. అయితే ఈ సారి ఆయ‌న మ‌రో కొత్త పాయింట్ ను కూడా ప్ర‌స్తావించారు.

వ‌చ్చే నెల 19న చివ‌రి ద‌శ పోలింగ్ ముగియ‌గానే... త‌న ఆర్జీ ఫ్లాష్ టీంతో చేయించిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంతో పాటు అదే రోజున మ‌రో అంశాన్ని కూడా చెబుతాన‌ని ఆస‌క్తి రేకెత్తించిన ఆయ‌న‌... తెలంగాణ ఫ‌లితాల్లో త‌న అంచ‌నా త‌ప్ప‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ మాట వెలువ‌డంగానే... ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల కంటే కూడా తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు త‌ప్ప‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యంపై అంద‌రూ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. చూద్దాం... మ‌రి ల‌గ‌డ‌పాటి ఆ రోజున ఆ కార‌ణాన్ని ఎలా చెబుతారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English