రాహుల్ కంటే... బాబే బెట‌రంట‌

రాహుల్ కంటే... బాబే బెట‌రంట‌

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ త‌ర‌ఫున మ‌రోమారు ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌రిలోకి దిగేశారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ త‌ర‌ఫున కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఇక కేసీఆర్ చెబుతున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ చెబుతున్న తృతీయ ఫ్రంట్ చాన్స్ ద‌క్కించుకుంటే... ప్ర‌ధాని ఎవ‌రన్న విష‌యంపై చాలా మంది పేర్లే వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ప్ర‌ధాన పోటీ ఎన్డీఏ వ‌ర్సెస్ యూపీఏనే క‌దా. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామ‌ని భావిస్తున్న నేత‌లంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ తోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు.

మ‌రి ఒక‌వేళ ఫ‌లితాల్లో ఎన్డీఏ బోల్తా కొట్టేసి... యూపీఏకు అధికారం ద‌క్కే అవ‌కాశాలే మెరుగైతే... ప్ర‌ధానిగా ఎవ‌రు ఎంపిక‌వుతారు? ఇదే అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింద‌ని చెప్పాలి. యూపీఏకు ఎలాగూ పూర్తి స్థాయి మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎన్డీఏ ఓడితే... ఇప్పుడు త‌న కూట‌మిలో లేని, మోదీకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌ను క‌లుపుకుని పోతే... యూపీఏ అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌వ‌చ్చు. ఎన్డీఏ ఓడితే జ‌రిగేది ఇదే. ఇదే జ‌రిగితే... పీఎంగా ఎవ‌రు ఉంటార‌న్న ప్ర‌శ్న‌కు ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితిలో పీఎం పోస్టుకు రాహుల్ గాంధీ కంటే కూడా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు బెట‌రంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

ఏ విష‌యంలో చూసుకున్నా... పీఎం పోస్టుకు రాహుల్ కంటే చంద్ర‌బాబే బెట‌ర‌ని ప‌వార్ వ్యాఖ్యానించారు. మోదీ ఓట‌మి కోసం ఇటు చంద్ర‌బాబుతో పాటు అటు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి దాదాపుగా కంక‌ణం క‌ట్టుకున్నారు. ఎన్డీఓ ఓడిపోతే... ఈ ముగ్గురూ కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మే. అయితే పీఎం పోస్టుపై త‌మ‌కు అంతగా ఇష్టం లేద‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో పాటు మ‌మ‌తా కూడా ప్ర‌క‌టించేశారు. దీంతో ఒక్క మాయావ‌తి మాత్రం రేసులో ఉన్న‌ట్లుగా లెక్క‌. ప‌వార్ పేర్కొన్న ప‌రిస్థితులే వ‌స్తే... బాబుతో పాటు మ‌మ‌త‌, మాయావ‌తి... ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు పీఎం అయ్యే అవ‌కశాలున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిని చంద్ర‌బాబు ఏ మేర‌కు త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English