సీఎస్ మాటలకు బాధపడ్డాను: చంద్రబాబు

సీఎస్ మాటలకు బాధపడ్డాను: చంద్రబాబు

ఏపీలో చంద్రబాబు, అధికారుల మధ్య వివాదం మరింత బిగుసుకుంటోంది. రెండు ప్రత్యర్థి పార్టీలు పోట్లాడుకుంటున్నట్లుగా కొందరు అధికారులు, టీడీపీ నేతల మధ్య యుద్ధం సాగుతోంది. ఎవరికి వారు మరొకరిని ఇబ్బంది పెట్టేలా, పైచేయి సాధించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రవర్తనా నియమావళిల ప్రస్తావన తెస్తూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న చంద్రబాబు సమీక్షలు జరపరాదంటూ సీఎస్ అభ్యంతరాలు వ్యక్తంచేయగా.. సీఎస్ తనపై చేసిన వ్యాఖ్యలు సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు చంద్రబాబు ఓ లేఖ రాశారు. ఓ పత్రికకు సీఎస్ ఇచ్చిన ఇంటర్వ్వూపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఆయన కోరారు. ‘అధికారాలు లేని సీఎం’ అని సీఎస్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో సీఎస్ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని, సీఎం అధికారాలపై వ్యాఖ్యలు చేసే అధికారం సీఎస్కు లేదని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎంకు ఉండే అధికారాల గురించి చెప్పేపని సీఎస్ది కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు ఇప్పటికే ఈసీకి కూడా లేఖ రాశారు. కేంద్రంలో మోదీ, పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి సీఎం కేసీఆర్ సమీక్షలు చేస్తుండగా లేని తప్పు తనకే ఎందుకు వచ్చిందని.. అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా అంటూ చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు రాసిన ఆ లేఖపై ఏపీ సీఈఓ స్పందిస్తూ పొరుగు రాష్ట్రాలు, కేంద్రంలో కోడ్ అమలు గురించి తనకు సంబంధం లేదని.. ఏపీలో కోడ్ అమలు తన బాధ్యత కాబట్టి ఆ ప్రకారంచంద్రబాబు సమీక్షలు జరపకుండా చూస్తున్నానని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English